Most Recent

Sobhita Dhulipala: షూటింగ్‌లో గరిటె పట్టిన శోభిత.. ఎంత బాగా వంట చేసిందో చూశారా? వీడియో వైరల్

Sobhita Dhulipala: షూటింగ్‌లో గరిటె పట్టిన శోభిత.. ఎంత బాగా వంట చేసిందో చూశారా? వీడియో వైరల్

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం గతేడాది డిసెంబర్ లో జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగిన వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక పెళ్లి తర్వాత నాగ చైతన్య మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు. తండేల్ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇదే క్రమంలో శోభిత ఇక సినిమాలు చేయదని చాలా మంది భావించారు. అయితే రూమర్లకు చెక్ పెడుతూ మళ్లీ సినిమాలతో బిజీగా మారిపోయిందీ అక్కినేని కోడలు. ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తోన్న శోభిత తన రెగ్యులర్ అప్ డేట్స్ ను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇటీవల తన సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్టు ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇదే మూవీ సెట్ నుంచి మరికొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. ఇందులో ఆమె వంట చేస్తున్న వీడియో కూడా ఉంది. ‘వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యం అంటూ ఒక క్రేజీ క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చింది.

ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అక్క మీలో కుకింగ్ టాలెంట్ కూడా ఉందా అని ఒకరు కామెంట్ చేయగా శోభత స్పందిస్తూ తనకు మూడ్ ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది చెల్లి అంటూ సమాధానం ఇచ్చింది. ఇక శోభిత షేర్ చేసిన ఈ ఫొటోలపై నాగచైతన్య కూడా స్పందించారు. శోభిత చేసిన వంటలను రుచి చూడటానికి ఎదురుచూస్తున్నాను అంటూ కామెంట్ పెట్టాడు. మొత్తానికి ఇప్పుడు శోభిత కుకింగ్ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

సెట్ లో వంట చేస్తోన్న శోభిత ధూళిపాళ్ల.. వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

ఇక నాగ చైతన్య ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడితో కలిసి ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు.

డబ్బింగ్ చెబుతోన్న నాగ చైతన్య సతీమణి..

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.