
ఈమధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు జనాల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. నిత్యం ఏదోక కొత్త కంటెంట్ అడియన్స్ ముందుకు వస్తుంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ డ్రామా చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. భార్య కుక్కను చంపినవాడి మీద హీరో రివేంజ్ తీర్చుకునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ సినిమా పేరు ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బాలెరినా. జూలై 13న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. జాక్ విక్ ఫిల్మ్ ప్రాంచైజీలో భాగమైన ఈ సినిమా జాక్ విక్ : చాప్టర్ 4కి ప్రీక్వెల్ ఇది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనా డి అర్మాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇండియాలో ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 4 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠి వంటి ఐదు భాషలలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి రెంటల్ విధానం లేకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో అనా డి అర్మాస్ ప్రధాన పాత్రలో నటించింది. బ్యూటీ విత్ వయోలెన్స్ డెడ్లీ కాంబో అనేలా గ్లామర్ గా కనిపిస్తూనే యాక్షన్ సీన్లలో అదరగొట్టింది. ఇందులో శత్రువులతో రక్తపాతం సృష్టిస్తుంది. ఈవ్ మకారో పాత్రలో నటించిన అనాతో పెట్టుకున్న వాళ్లకు చావే అన్నట్లుగా ఈ సినిమాను రూపొందించారు.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
ఈ సినిమా ఒక రివేంజ్ స్టోరీ. పగతో శత్రువులను చంపే కిల్లర్ లేడీ. తనను చంపేందుకు తన గురువు లాంటి జాన్ విక్ ఎదురుపడడం వంటి సీన్లతోనే రెగ్యూలర్ ఫార్మాట్ లో సాగుతుంది. ఈ సినిమాకు థియేటర్లలో హిట్ అందుకోగా.. ఇప్పుడు ఓటీటీలోనూ ఆకట్టుకోనుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..