
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తండ్రి పెద్ద నిర్మాత. తల్లి స్టార్ హీరోయిన్. దీంతో చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుసగా విభిన్న కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు 28 ఏళ్ల వయసులోనే పాన్ ఇండియా లెవల్లోనే సెన్సేషన్ హీరోయిన్ గా మారింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రస్తుతం పరం సుందరి చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో కేరళ బ్యూటీగా కనిపించనుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న జాన్వీ తన వివాహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
ది కపిల్ శర్మ షోలో జాన్వీ మాట్లాడుతూ తనకు ముగ్గురు పిల్లలు కావాలని తెలిపింది. “మూడు నా అదృష్ట సంఖ్య. ఇద్దరు పిల్లలు గొడవపడితే, మూడవ వ్యక్తి వారికి మద్దతుగా ఉంటాడు. ఈ విధంగా, ఎవరికైనా ఎల్లప్పుడూ ఒకరి తోడుగా ఉంటారు.” అంటూ చెప్పుకొచ్చింది. వివాహం తర్వాత తన భర్త, పిల్లలతో తిరుమల తిరుపతిలో స్థిరపడాలని కోరుకుంటున్నానని నటి చెప్పింది. అరటి ఆకులపై భోజనం చేయాలని, ప్రతిరోజూ ‘గోవింద గోవింద’ నినాదాలు వినాలని, జుట్టులో మల్లెపూలు ధరించాలని ఉందంటూ తెలిపింది.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
జాన్వికి తిరుపతితో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున, తల్లి శ్రీదేవి వర్ధంతి రోజున ఆమె తిరుమల ఆలయాన్ని సందర్శిస్తుంది. అందుకే తన వివాహాన్ని సైతం అక్కడే జరగాలని కోరుకుంటుంది. ఇక చెన్నైలోని శ్రీదేవి పూర్వీకుల ఇంట్లో మెహందీ, సంగీత వేడుకలు నిర్వహించాలని అన్నారు. అయితే ఇప్పుడే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని.. ప్రస్తుతం తన కెరీర్ పైనే దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది చిత్రంలో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..