Most Recent

Actress: అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు బాక్సాఫీస్ సెన్సేషన్.. కుర్రాళ్లు తెగ వెతికేస్తున్న హీరోయిన్..

Actress: అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు బాక్సాఫీస్ సెన్సేషన్.. కుర్రాళ్లు తెగ వెతికేస్తున్న హీరోయిన్..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరు మారుమోగుతుంది. ఆమె నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే కళ్యాణి ప్రియదర్శన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లోకా చిత్రం గతవారం థియేటర్లలో విడుదలైంది. ఇది హీరోయిన్-సెంట్రిక్ సినిమా. ఇందులో తన సహజ నటనతో ప్రశంసలు అందుకుంటుంది. దీంతో ఇప్పుడు కళ్యాణి పేరు మారుమోగుతుంది. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు కళ్యాణి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..

ఈ సినిమాలో నటించిన కళ్యాణి కోరిక సినిమాల్లో నటించడం కాదు. ఆమె ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, సీనియర్ హీరోయిన్ లిస్సీల కుమార్తె. చెన్నైలో జన్మించిన ఆమె.. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. సింగపూర్ వెళ్లి గ్రాడ్యుయేషన్ చేసింది. అక్కడే పలు నాటకాల్లో నటించింది. న్యూయార్క్ లో ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసింది. కళ్యాణికి ఆర్ట్ డైరెక్టర్ కావాలనేది చాలా కోరిక. ఆమె ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ అభిమాని. ఆమె తండ్రి కోరిక మేరకు సాబు సిరిల్ దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసింది. హృతిక్ ‘క్రిష్ 3’, విక్రమ్ ‘ఇరు ముగన్’ చిత్రాలకు పనిచేసింది. ఆ తర్వాత, కళ్యాణి మనసు నటన వైపు మళ్లింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

2017లో టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేనితో కలిసి ‘హలో’ సినిమా తెలుగులోకి హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మనాడు సినిమాతో హిట్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. మలయాళంలో హిట్టైన హృదయం మూవీతో ఈ అమ్మడు కెరీర్ మలుపు తిప్పింది. హృదయం సినిమాకు ముందు ఆమె ఎనిమిది సినిమాల్లో నటించింది. కానీ ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. కానీ ‘హృదయం’ సినిమా ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది. ఇప్పుడు లోకా సినిమా ఆమె కెరీర్ లో అతిపెద్ద హిట్. ఈ మూవీ మొత్తాన్ని కళ్యాణి తన భుజాలపైకి తీసుకుంది. ఇందులో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేసింది. కళ్యాణి యాక్టింగ్ కు జనాలు ఫిదా అవుతున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె తమిళ సినిమాల్లో నటిస్తుంది. జీనీ, మార్షల్ అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.