
రెండో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగింది. నిన్నటి ఎపిసోడ్‌లో రీతూ చౌదరి, హరీష్ మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. రీతూ చౌదరి మాత్రమే కాదు హౌస్ లో ఉన్న లేడీస్ హరీష్ పై మండిపడ్డారు. ఒకొక్కరి పాయింట్స్ కు, నామినేషన్స్ కు హరీష్ కు దిమ్మతిరిగింది. రీతూ చౌదరి ముందుగా హరీష్‌ను నామినేట్ చేసింది. మీరు గివ్ అప్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని రీతూ పాయింట్ లాగింది. మిగతావాళ్ల గురించి నాకు తెలీదు కానీ నాతో అయితే గౌరవంగానే మాట్లాడారు.. మీలో నాకు నచ్చని విషయం ఏంటంటే మీరు మాట్లాడుతుంటే మీది తప్పు అన్నట్లు మిగిలిన హౌస్‌మేట్స్‌కి అనిపించింది.. కానీ నాకు ఎప్పుడూ అనిపించలేదు. కానీ నేను తినను.. నేను వెళ్ళిపోతాను.. నేను ఉండను అంటూ గివ్ అప్ ఇవ్వడం నాకు నచ్చలేదు.. గివ్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదు అని రీతూ పాయింట్ చెప్పింది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరే అంటారు.. కానీ అదే అన్నం మీ కోసం, మీ ముందు గంటన్నర వెయిట్ చేసింది. ఫుడ్‌కి మీరు అంత గౌరవం ఇచ్చేటప్పుడు అంత మంది అడిగారు సరే పోని అంతమంది గురించి కాదు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించైనా మీరు తినొచ్చు కదా.. అలాగే మీరు ఇందాక మాట్లాడుతూ లైఫ్‌లో చాలా చూశాను.. సొసైటీని వద్దనుకుని వెళ్లిపోయను అని అన్నారు అని చెప్పుకొచ్చింది. దాంతో హరిత హరీష్ రీతూ పై వాదనకు దిగాడు.
నా బ్రతుకు నాకు నచ్చినట్టు బ్రతుకుతా..? నీకు నచ్చినట్టు నేను బ్రతుకును నేను గివ్ అప్ ఇచ్చింది ఫుడ్ కు మాత్రమే.. నా లైఫ్ కు జనాలకు కాదు. నేను ఫుడ్ తినకపోవడానికి ఓ కారణం ఉంది. ఫస్ట్‌డే తిన్నప్పుడే నేను చాలా బాధపడి తిన్నాను.. వండేవాళ్లు ఎవరైతే ఉన్నారో ఎందుకో నాకే అది నచ్చలేదు అని చెప్పుకొచ్చాడు. అలాగే మొదటి రోజే నేను తినను అని చెప్పా..అయితే హరీష్ గారు వద్దు ఫుడ్ మీద చూపించొద్దు తినండి అని శ్రీజ చెప్పడంతో కళ్లల్లో నీళ్లు వస్తున్నా కామ్‌గా తిన్నాను అని అన్నాడు. మూడు రోజులు అయ్యింది అయినా ఇక్కడ పరిస్థితి మారలేదు దాంతో నేను ఫుడ్ మానేసి ఫ్రూట్స్ తింటున్నా అని చెప్పాడు హరీష్. మీకు నచ్చినట్లు ఉండలేను.. నాకు నచ్చిన మనుషులు బయటున్నారు.. వాళ్లకి నచ్చినట్లు ఉంటా.. అంటూ హరీష్ తన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. దాంతో రీతూ మళ్లీ వాదించింది. హౌస్ లో ఉన్న నలుగురు ఎదో అన్నారని నేను షోనే క్విట్ చేసి వెళ్లిపోతాను అంటే అది గివప్ ఇచ్చే పర్సనాలిటీయే కదా..? అని తిరిగి ప్రశ్నించింది. అది గివ్ అప్ ఇవ్వడం కాదు నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి అని చెప్పాడు. మీకే కాదు ఇక్కడికి వచ్చిన మా అందరికి ఫ్యామిలీ ఉంది. అని రీతూ అంటే నన్ను ఇక్కడ చరిత్రహీనుడని ముద్ర వేశారు దాని నుంచి బయట నా మనుషుల్ని కాపాడుకోవాలని నేను క్విట్ అవుతా అని చెప్పా అని హరీష్ వాదించాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని మీరు ప్రూ చేయాలి అని రీతూ.. మీ కోసం ఉండటానికి నేను ఇక్కడికి రాలేదు అని హరీష్ వాదించుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.