Most Recent

తస్సాదీయ ఎంత మారిపోయింది.. పౌర్ణమి మూవీ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

తస్సాదీయ ఎంత మారిపోయింది.. పౌర్ణమి మూవీ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక డార్లింగ్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఇదిలా ఉంటే.. డార్లింగ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పౌర్ణమి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పటికీ ఎక్కడో ఒకచోటు వినిపిస్తూనే ఉంటాయి. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో త్రిష, ఛార్మీ హీరోయిన్లుగా నటించారు. అయితే హీరోయిన్ సింధు తులానీ కీలకపాత్ర పోషించింది.. ఇదిలా ఉంటే ఈ మహిళ వివాహిత మోహని పాత్రలో నటించింది మధు శర్మ.

ముంబై చెందిన మధు శర్మ పౌర్ణమి సినిమా కంటే ముందు హిందీ, మరాఠీ భాషలలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలో నటించి పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో గురు పర్వాయ్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిన్నదాని అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఈ భామ. అలాగే శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా నటించిన అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అల్లరి నరేష్, శశాంక్ సరసన పార్టీలో కనిపించింది.

ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రభాస్ పౌర్ణమి చిత్రంలో మోహిని పాత్రలో నటించింది. తెలుగులో శ్రీహరి హీరోగా నటించిన హనుమంతు, బ్రహ్మా వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటించిన మధుశర్మ ఆ తర్వాత టాలీవుడ్ కు దూరమై హిందీలో సీరియల్స్ చేస్తుంది. ఇప్పుడు మధుశర్మ భోజ్ పురిలో సినిమాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మధుశర్మ లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Madhhu Shharma (@madhhuis)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.