
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మదరాసి. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 91 కోట్ల కలెక్షన్లు సాధించింది. లేటెస్ట్ సెన్సేషణ్ రుక్మిణి వసంత్ మదరాసి మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆమె అంద చందాలు, శివ కార్తికేయన్ నటన, యాక్షన్ సీక్వెన్స్ లకు అభిమానుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే మురుగదాస్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదు. దీంతో కొన్ని వర్గాల వారికి మాత్రమే ఈ సినిమా నచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.
మదరాసి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు రూ. 60 కోట్లు అప్పగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 నుంచి మదరాసి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన రావొచ్చు. తమిళ్ , తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 03 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు ఛాన్స్!
OCTOBER 2025 Important OTT Releases
• #Madharaasi : Prime Video
• #WAR2 : NETFLIX
• #Coolie (Hindi) : Prime Video
• #ParamSundari : Prime Video
• #LokahChapter1 : TBA
• #Baaghi4 : Prime Video pic.twitter.com/zwUtXkRC2U— OTT STREAM UPDATES (@newottupdates) September 10, 2025
శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్ పై శ్రీ లక్ష్మీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. విద్యుత్ జమాల్ మెయిన్ విలన్ గా ఆకట్టుకున్నాడు. అలాగే బిజు మేనన్, షబ్బీర్ కరైక్కల్, విక్రాంత్, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవి చందర్ స్వరాలు సమకూర్చారు.
మళ్లీ ఇదే కాంబోలో సినిమా..
The latest reports from the Tamil media reveal that #ARMURUGADOSS & #SIVAKARTHIKEYAN are planning to collaborate once again.
Reportedly, Murugadoss narrated an interesting subject to Sivakarthikeyan during the shoot of #Madharaasi. pic.twitter.com/jpkKfEXYUg
— MOHIT_R.C (@Mohit_RC_91) September 16, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి