
బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ ను ఉతికి ఆరేశారు. బిగ్ బాస్ మొదలై ఈరోజుకు వారం. మొదటి వారం ఎలిమినేషన్ నేడు జరగనుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్. వీరిలో శ్రష్ఠి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తుంది. ఈ అమ్మడు వచ్చిన వారం లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అలాగే ఓటింగ్ లోనూ ఈ చిన్నదానికి తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో శ్రష్ఠి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఒకొక్కరికి ఇచ్చిపడేశారు. ముఖ్యంగా హరీష్, శ్రీజ దమ్ము, మనీష్..
ముందుగా కెప్టెన్ అయిన సంజనను నాగ్ అభినందించారు. అలాగే కెప్టెన్ మాట ఎవరూ వినడం లేదు అని చెప్పుకొచ్చింది సంజన. ఆతర్వాత సంజనకు, ఫ్లోరా షైనీకి మధ్య జరిగిన దాని గురించి అడిగారు నాగ్. ఫ్రీబార్డ్ అన్న పదాన్ని ఫ్లోరా షైనీ తప్పుగా తీసుకుందని సంజన నాగ్ కు తెలిపింది. ఇక ఈ ఇద్దరి మధ్య గొడవను దాదాపు క్లియర్ చేశారు నాగ్. అంతే కాదు నాగ్ ముందే కన్నీళ్లు కూడా పెట్టుకుంది సంజన. ఫ్లోరా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిందని గుర్తు చేస్తూ నాగ్ ముందు ఏడ్చేసింది సంజన. దాంతో సంజనకు క్షమాపణ చెప్పమని ఫ్లోరకు చెప్పారు నాగ్. దాంతో ఆమె క్షమాపణ చెప్పింది.
ఆతర్వాత తనూజ ను లేపి వంట గురించి అడిగారు. ఆలు కూర గురించి అడిగి ఆమెను ధైర్యంగా ఉండమని చెప్పారు నాగ్. ఎమోషనల్‌గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు.. నువ్వు ఏడొద్దు. ధైర్యంగా ఎదుర్కో అని తనూజాకు చెప్పారు నాగ్. అనవసరంగా తనూజ మీద నింద వేసిన ప్రియా, శ్రీజలకు నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆతర్వాత రీతూ చౌదరి, తనూజ మధ్య ఇష్యును కూడా సాల్వ్ చేశారు నాగ్. దాంతో ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఇమ్మానుయేల్ ను లేపి గుండు అంకుల్ ఇష్యూ గురించి మాట్లాడారు. అందర్నీ నవ్వించాలనే అలా చేశా ఆతర్వాత వెళ్లి క్షమాపణ చెప్పా అని ఇమ్మానుయేల్ అన్నాడు. గుండు అంకుల్ అనే మాటని సరదాగా అన్నాడని హౌస్ లో ఎంతమంది అనుకుంటున్నారు అని అడిగారు నాగార్జున. దాంతో అందరూ చేతులు పైకిఎత్తారు. ‘చూశావా హరీష్.. హౌస్‌లో ఉన్న వాళ్లే కాదు.. బయట ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. ఇమ్మూ అలా చేసింది నవ్వించడానికే తప్ప బాడీ షేమింగ్ కాదు అని నాగ్ అన్నారు. దాంతో ఇమ్మానుయేల్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ‘ఆడియన్స్ అంతా నీ పక్కనే ఉన్నారు.. నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు. నువ్వు సరదాగా అన్నావ్ తప్ప.. రాంగ్‌గా అనలేదని జనం నమ్మారు.. నువ్వు ఇలాగే ఎంటర్ టైన్ చేస్తూ హ్యాపీగా ఉండు అని ఇమ్మూకు చెప్పాడు నాగ్. అయినా కూడా హరీష్ వితండవాదం చేయడానికి ప్రయత్నించాడు. నాగ్ చెప్తున్నా వినకుండా ఇమ్మూదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు హరీష్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి