Most Recent

క్లైమాక్సే సినిమాను లేపింది.. చిన్న సినిమా అనుకున్నారు.. రూ. 400కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది

క్లైమాక్సే సినిమాను లేపింది.. చిన్న సినిమా అనుకున్నారు.. రూ. 400కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది

ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు దుమ్మురేపుతున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు సంచలన విజయాన్ని సాధిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలై వెయ్యికోట్లకు పైగా వసూల్ చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు (తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు). కథ మంచిగా ఉంటే చాలు ఇతర బాషల సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాంటి వాటిలో ఈ సినిమా ఒకటి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒకెత్తు. సినిమా మొత్తాన్ని క్లైమాక్స్ మార్చేసింది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

పై ఫొటోలో కనిపిస్తున్న సినిమా ఎదో కాదో.. కన్నడ భాషలో విడుదలై అక్కడ భారీ విజయాన్ని అందుకొని ఇతర భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఎదో కాదు రిషబ్ శెట్టి నటించిన కాంతార. కన్నడ భాషలో తెరకెక్కిన కాంతార సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో అత్యాశకు పోయిన మనిషికి, ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణ చూపించారు.

ఆ ప్రాంత సంప్రదాయం.. మనిషి దురాశను చూపిస్తుంది. స్థానిక జానపద కథలు, ఆచారాలు, కర్ణాటకలోని దక్షిణ కన్నడలోని ప్రసిద్ధ సంప్రదాయం భూత కోలను ఎంతో అందంగా వెండితెరపైకి తీసుకువచ్చారు. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన సినిమాకే హైలైట్. ముఖ్యంగా క్లైమాక్స్ లో అద్భుతంగా నటించాడు రిషబ్ శెట్టి. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. సంయుక్త గౌడ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అలాగే ఈ సినిమా నటించిన ప్రతిఒక్కరు తమ పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.