
బిగ్‌బాస్ సీజన్ 9 ఎలిమినేషన్ జరిగిపోయింది. కొరియోగ్రఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి సభ్యునికి ఇద్దరు సభ్యులను నామినేట్ చేసే హక్కు ఉంటుంది. మీరు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని భావించిన ఇద్దరు సభ్యులను తగిన కారణాలు స్పష్టంగా చెప్పి నామినేట్ చేసి వారి ముఖానికి రెడ్ పూయాల్సి ఉంటుందని చెప్పాడు. కెప్టెన్ సంజనను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియను తనూజ గౌడతో స్టార్ట్ చేశారు. ముందుగా తనూజ తన ఫస్ట్ నామినేషన్ హరిత హరీష్ అంటూ చెప్పుకొచ్చింది. లాస్ట్ వీక్ అతడి బిహేవియర్ వాకు నచ్చలేదు.. ఆయన నా బిహేవియర్ గురించి మాట్లాడారు. అది ఫస్ట్.. ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు.. కానీ ఆ రోజు చేయి చూపించి బిహేవియర్.. అది చేయండి.. ఇది చేయండి చాలా మాటలు అనేశారు. అందుకే నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది.
ఇక తనూజ మాటలకు హరీష్ రియాక్ట్ అవుతూ గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు. మొదటి రోజు కుకింగి వచ్చినప్పుడు ప్రియ తినాలకున్నప్పుడు మీకు ఫుడ్ వచచింది. అరెస్ రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేయించుకుని తినేదాన్ని అంది.. కానీ మళ్లీ ఆమ్లెట్ వేసుకుని తిన్నది అని హరీష్ చెప్పడంతో నేనే తినమని ఫోర్స్ చేశానని చెప్పింది తనూజ. ఆ నెక్ట్స్ డే బ్రేక్ ఫాస్ట్ సమయంలో మీ రియాక్షన్, మీ చికాకు, అసహనం కనిపించింది. అది నాకు నచ్చలేదని అన్నాడు హరీష్.
నాకు 24 గంటలు నవ్వుతూ ఉండడం రాలేదు.. మీరు ఒక్క మాట తీసుకోలేక అందర్నీ వదిలేసి మూల కూర్చున్నారు. నేను రియల్ లైఫ్ లో నా ఫ్యామిలీతో కూడా కలవను.. నా రూంలో ఉంటాను అంటూ తనూజ ఫైర్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ మీ నుంచి స్టార్ట్ అయ్యింది. రెండు రోజులు.. నా రియాక్షన్ అది.. నా నుంచి స్టార్ట్ అవ్వలేదు.. అన్నాడు హరీష్. ఇక ఇద్దరి మధ్య హీట్ అర్గ్యుమెంట్ జరిగింది. హే వినండి.. నా నామినేషన అంటూ హరీష్ పై ఫైర్ అయ్యింది తనూజ. ఆ తర్వాత తన రెండో నామినేషన్ ఫ్లోరా సైనిని చేసింది.
ఆ తర్వాత మర్యాద మనీష్ తన నామినేషన్ ముందుగా భరణిని చేస్తూ రీజన్స్ చెప్పాడు. ఆ తర్వాత రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. రూల్స్ అన్ని తెలిసే బ్రేక్ చేస్తున్నారని.. అందుకే గొడవలు అయ్యాయని అన్నారు. ఇక రీతూ సైతం గట్టిగానే డిఫెండ్ చేసుకుంది.