Most Recent

బ్లాక్ బస్టర్ సినిమాకు ఇదేం కష్టం..! ఒకటికొంటే మరొకటి ఫ్రీ.. మిరాయ్ సినిమా టికెట్స్ పై ఆఫర్..

బ్లాక్ బస్టర్ సినిమాకు ఇదేం కష్టం..! ఒకటికొంటే మరొకటి ఫ్రీ.. మిరాయ్ సినిమా టికెట్స్ పై ఆఫర్..

తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన మిరాయ్ మొదటి రోజే మంచి టాక్ తోపాటు ఓపినింగ్స్ కూడా సాధించింది. రితిక్ నాయక్ ఇందులో హీరోయిన్ గా నటించగా , మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించాడు. అలాగే ఒకప్పటి టాలీవుడ్ అందాల తార శ్రియా శరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించింది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ సినిమాలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా అదరగొట్టగా.. నెగిటివ్ రోల్‌లో మంచు మనోజ్ మెరిశారు. అలాగే శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం, తంజా కెల్లర్, రాజేంద్రనాత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌరా హరి స్వరాలు అందించాడు.

ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా కమిట్‌మెంట్‌ అడుగుతున్నారు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఇక మిరాయ్ సినిమాకు తెలుగులో భారీ కలెక్షన్స్  వస్తున్నాయి. రెండు రోజుల్లోనే మిరాయ్ సినిమా రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది మిరాయ్. అలాగే విడుదలైన ఇతర భాషల్లోనూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మిరాయ్ సినిమా టికెట్ కు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అనౌన్స్ చేశారు. రెండో రోజు నుంచే ఈ చిత్రానికి ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

కాగా మిరాయ్ సినిమా తెలుగు, తమిళం,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక హిందీ వర్షన్ ను కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదలచేశారు. అయితే ఈ సినిమా హిందీలో హనుమాన్ కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ లో మిరాయ్ సినిమా రూ. 4.85 కోట్లు రాబట్టగలిగింది. దాంతో ధర్మ ప్రొడక్షన్స్ సినిమా టికెట్ పై ఆఫర్ పెట్టారు. ఒక టికెట్ కొంటె మరో టికెట్ ఫ్రీ అని ఆఫర్ పెట్టారు.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

 

View this post on Instagram

 

A post shared by Dharma Productions (@dharmamovies)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.