Most Recent

Peddi Movie: పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్ తల్లిగా ఆ సీనియర్ నటి..

Peddi Movie: పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్ తల్లిగా ఆ సీనియర్ నటి..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పెద్ది ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలోని ఓ పాట కోసం కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో షూట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కించిన ఈ పాట సినిమాకు హైలెట్ అవుతుందని టాక్ వినిపించింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

ఇదిలా ఉంటే.. ఈ దసరా పండక్కి ఈ సినిమా నుంచి ఓ మ్యూజికల్ సింగిల్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే రామ్ చరణ్ ఆ పాటను విన్నారని.. అద్భుతంగా ఉందని మెచ్చుకున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపికయ్యారని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో భారీగానే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రతోపాటు ఆయన తల్లి పాత్ర సైతం అంతే కీలకంగా ఉండనుందట. అందుకే ఈ సినిమాకు సీనియర్ నటి విజి చంద్రశేఖర్ ను తీసుకున్నారట. ఇప్పటికే ఆమె తెలుగులో అఖండ చిత్రంలో బాలకృష్ణకు తల్లిగా కనిపించారు.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

విజి చంద్రశేఖర్ ఎక్కువగా తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు. 1981 రజినీకాంత్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు. సీనియర్ నటి సరితకు విజి చంద్రశేఖర్ సోదరి. మరో చరిత్ర, ఇది కథ కాదు, కోకిల వంటి చిత్రాల్లో సరిత కథానాయికగా నటించారు. ఇక ఇప్పుడు పెద్ది చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.