Most Recent

Vikram Prabhu: ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ అల్లు అర్జున్ హిట్టుకొట్టారు.. యంగ్ హీరో కామెంట్స్..

Vikram Prabhu: ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ అల్లు అర్జున్ హిట్టుకొట్టారు.. యంగ్ హీరో కామెంట్స్..

సినీరంగంలో అప్పుడప్పుడు కొందరు హీరోస్ చేయాల్సిన సినిమాలు మరోక హీరో వద్దకు వెళ్తుంటాయి. ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని దర్శకులు కథలు రాసుకుంటారు. కానీ అనివార్య కారణాలతో ఆ నటుడు కాకుండా మరో హీరోతో ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తుంటారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు స్టార్స్ చేయాల్సిన సినిమాలు మరొకరి ఖాతాల్లోకి వచ్చిపడ్డాయి. కొన్నిసార్లు పలు చిత్రాలు భారీ విజయాన్ని అందుకోగా.. మరికొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. తాజాగా ఈ యంగ్ హీరో తాను మిస్సైన సూపర్ హిట్ గురించి బయటపెట్టారు. తాను చేయాల్సిన ఓ సినిమాతో అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నారని… ఆ పాత్రలో బన్నీ యాక్టింగ్ అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఆ హీరో పేరు వెంకట్ ప్రభు.

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

విక్రమ్ ప్రభు.. ఈ పేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు. తెలుగు, తమిళం ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించిన ప్రభు కుమారుడే విక్రమ్ ప్రభు. తమిళంలో హీరోగా కొనసాగుతున్న ఆయన.. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన నటించిన తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వ్చచింది. ఇక ఇప్పుడు తెలుగులో మొదటి సారి విక్రమ్ ప్రభు నటిస్తోన్న సినిమా ఘాటీ. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఇప్పుడు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ ప్రభు.. గతంలో తాను అనుష్కతో ఓ సినిమా చేయాల్సి ఉందని.. కానీ మిస్సైందని అన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం డైరెక్టర్ గుణశేఖర్ ముందుగా తనను సంప్రదించారని.. మూడు నెలలు డేట్స్ కావాలని అడిగారని.. కానీ అప్పుడే తాను వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో చేయలేకపోయానని అన్నారు. కానీ అల్లు అర్జున్ ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని.. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చారు. దీంతో విక్రమ్ ప్రభు కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రతో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.