Most Recent

Sampangi: సంపంగి మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త క్రేజీ హీరో.. ఎవరంటే..

Sampangi: సంపంగి మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త క్రేజీ హీరో.. ఎవరంటే..

తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సంపంగి. ఈ చిత్రానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. 2001లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే అందమైన ప్రేమకథగా సంపంగి నిలిచింది. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే.. స్నేహంగా ఉన్న రెంటు కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలోని ఫ్యామిలీ ఎమోషన్స్ జనాలను ఆకట్టుకున్నాయి. సనా యాదిరెడ్డి ద ర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపక్ హీరోగా నటించారు. ఇందులో కథానాయికగా కంచి కౌల్ కనిపించింది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

సంపంగి చిత్రంలో వీరిద్దరి జోడి, కెమిస్ట్రీ జనాలకు తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఫ్యామిలీ సర్కర్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత హిందీలో ఒక సినిమా చేసింది. 2005లో ఏక్ లడ్కీ అంజనీ సి అనే టీవీ షోలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఇదిలా ఉంటే.. కంచికౌల్.. బుల్లితెర హీరో నటుడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. షబ్బీర్ హిందీలో పలు సీరియల్స్ చేసారు. కుంకుమ భాగ్య, వసంత కోకిల సీరియల్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

 

View this post on Instagram

 

A post shared by kanchikaul (@kanchikaul)

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.