Most Recent

OTT Movie: బాబోయ్.. ప్రతి క్షణం భయానకం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఈ హారర్ సినిమాను చూశారా.. ?

OTT Movie: బాబోయ్.. ప్రతి క్షణం భయానకం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఈ హారర్ సినిమాను చూశారా.. ?

ఈ సంవత్సరంలో వచ్చిన ఒక భయానక చిత్రం ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ మూవీ కథ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. దాదాపు 133 నిమిషాల పాటు ఈ చిత్రం రెప్ప వేయనీవ్వదు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ వరకు ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది. మనం మాట్లాడుతున్న సినిమా పేరు మా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ నటించిన సూపర్ నేచురల్ హారర్ చిత్రం ‘మా’ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. ఇందులో ఆమె అంబిక అనే పాత్రను పోషించింది. ఈ చిత్రంలో అంబిక తన భర్త మరణం తర్వాత తన టీనేజ్ కుమార్తెతో నగరంలో నివసిస్తుంటుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

కానీ కొన్ని కారణాల వల్ల అంబిక తన కుమార్తెతో కలిసి తాను పుట్టి పెరిగిన చిన్న కొండ గ్రామానికి వెళ్లి తన పూర్వీకుల ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వారికి అసలైన ప్రమాదం ఎదురవుతుంది. చాలా సంవత్సరాలుగా యువతులు రహస్యంగా అదృశ్యం కావడం లేదా చంపబడటం వంటి సంఘటనలు అక్కడ జరుగుతుంటాయి. ఈ సంఘటనల వెనుక ఒక దుష్టశక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. అంబిక కుమార్తెకు ఒక వింత వ్యాధి ఉంటుంది. దీంతో ఆ సమస్యకు చికిత్స చేయడంతో ఆ దుష్టశక్తి ఆమెకు దగ్గరగా వస్తుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ఆ తర్వాత దుష్టశక్తి అంబిక కుమార్తెను లక్ష్యంగా చేసుకుంటుంది. తన కూతురుని కాపాడుకోవడానికి అంబిక పోరాడుతుంది. పెయింటర్ అయిన అంబిక, తన పూర్వీకుల ఇంట్లోని కొన్ని పాత పుస్తకాలు, టాల ద్వారా తన కుటుంబం ఒకప్పుడు దుష్టశక్తిని నియంత్రించిందని తెలుసుకుంటుంది. అంబిక ఆ రహస్యాలను కనుగొని, తన కుమార్తెను, గ్రామ ప్రజలను రక్షించడానికి ఆ దుష్టశక్తితో కఠినమైన పోరాటం చేస్తుంది. ఈ సినిమా ఆద్యంతం కట్టిపడేస్తుంది. కాజోల్ నటించిన ఈ చిత్రానికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించగా, రోనిత్ రాయ్, గోపాల్ సింగ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.