Most Recent

Tollywood: బాత్రూమ్ గోడల్లో కోట్లు దాచిపెట్టిన హీరోయిన్.. ఒక్క అబద్ధం చెప్పడంతో కెరీర్ క్లోజ్..

Tollywood: బాత్రూమ్ గోడల్లో కోట్లు దాచిపెట్టిన హీరోయిన్.. ఒక్క అబద్ధం చెప్పడంతో కెరీర్ క్లోజ్..

సినీరంగంలో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే బాత్రూం గోడలో వందల కోట్లు దొరకడం.. వాటి గురించి ఆమె చెప్పిన ఒక్క అబద్ధం చివరకు కెరీర్ నాశనమయ్యేలా చేసింది. ఆమె పేరు మాలా సిన్హా. అసలు పరేు అల్డా సిన్హా. 1936 నవంబర్ 11 బెంగాలీ నేపాలీలో జన్మించింది. 1954లో బాద్ షా సినిమాతో నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తన కెరీర్ లో దాదాపు 120 సినిమాల్లో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ ధర్మేంద్ర, గురు దత్, అశోక్ కుమార్, దిలీప్ కుమార్ వంటి నటులతో కలిసి నటించింది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది.

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..

హిందీలో ప్యాసా, ధూల్ కా ఫూల్, హరియాలీ ఔర్ రాస్తా, అన్పఢ్, గుమ్రా వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 1958 నుంచి 1965 వరకు ఆమె అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. అయితే నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం సవాళ్లు, విమర్శలు ఎదుర్కొంది. ఆమె డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేదని టాక్. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేశారు. ఆ దాడిలో బాత్రూమ్ గోడలో కట్టల కొద్ది డబ్బు దొరికింది. అప్పట్లోనే రూ.100 కోట్ల వరకు డబ్బును అధికారులు జప్తు చేశారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..

ఆ డబ్బు చట్టబద్ధంగా సంపాదించినది అని నిరూపించాల్సి వచ్చింది. దీంతో తన తండ్రి, లాయర్ సలహాపై ఆ డబ్బును వేశ్యా వృత్తితో సంపాదించిందని కోర్టులో అబద్ధం చెప్పింది. దీంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమెకు.. ఒక్క మాటతో అవకాశాలు, అభిమానులు తగ్గిపోయారు. ఆమెతో పనిచేయడానికి దర్శకనిర్మాతలు అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో సినిమా ప్రపంచం నుంచి తప్పుకుంది. 1966లో నేపాలీ నటుడు చిదంబర్ ప్రసాద్ లోహానీని వివాహం చేసుకుంది. వారికి ప్రతిభా సిన్హా అనే కూతురు ఉంది. 2024లో ఆమె భర్త మరణించారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది మాలా.

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

Mala Sinha Movie S

Mala Sinha Movie S

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.