
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఆయన అభిమానులు వెట్టి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చివరిగా చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్, చరణ్ లాంటి పెద్ద హీరోతో పాటు చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నా కూడా గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో చరణ్ ఫాన్స్ ఇప్పుడు పెద్ది సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇక పెద్ది సినిమాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నాడు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారిన ఈ సుకుమార్ శిష్యుడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు. రెండో సినిమానే చరణ్ తో చేసే ఛాన్స్ అందుకున్నాడు.
ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..
ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ మూవీని గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు ఇప్పటికే ఈ సినిమా నుంచి బయకు వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చరణ్ లుక్స్ అదిరిపోయాయి. ఉత్తరాంధ్ర స్టైల్ లో ఈ మూవీ ఉండనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..
పెద్ది సినిమాలో ‘ఫిల్మీమోజీ’ ఉండనుందని అంటున్నారు. యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయిన ఫిల్మీ మోజీని పెద్ది కోసం రంగంలోకి దింపనున్నారని అంటున్నారు. ఫిల్మీ మోజీ ఉత్తరాంధ్ర స్టైల్ ఉండటంతో ఆ యాస కోసం అలాగే అక్కడి వాడుక డైలాగ్స్ కోసం బుచ్చిబాబు ఫిల్మీ మోజీ టీమ్ ను సంప్రదించారట. ఈ విషయాన్నీ ఫిల్మీమోజీ సాయి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘పెద్ది’ సినిమాకి డైలాగ్ రైటింగ్‌లో సాయం చేయమని బుచ్చిబాబు అడగడంతో సాయి కిరణ్ ఫిల్మీ మోజీ షూట్ వల్ల ఫుల్‌గా పని చేయకపోయినా.. కొన్ని డైలాగ్‌లకు సహాయం చేశాను అని చెప్పుకొచ్చాడు.
అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి