
90వ దశకంలో తమదైన నటనతో సినీప్రియులను అలరించి.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ నటుడు కమ్ డ్యాన్స్ మాస్టర్ ఒకరు. తెలుగు, తమిళం సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు రామ్ జీ 90’s సినిమాల్లో టాప్ హీరో. అంతేకాదు.. ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ కూడా. అతడి స్టెప్పులకు, డ్యాన్స్ మూమెంట్లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశాడు. 1991లో విడుదలైన తమిళ చిత్రం కిఖుష్ కరై సినిమాతో డ్యాన్సర్ గా అరంగేట్రం చేశాడు రామ్ జీ. 1996 లో అజిత్, దేవయాని కలిసి నటించిన ప్రేమలేఖ సినిమాలో చిన్నదాన పాటతో మరింత ఫేమస్ అయ్యాడు. తమిళంతోపాటు తెలుగులోనూ అనేక సినిమాల్లో నటించాడు.
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
సినిమాలతోపాటు తమిళంలో పలు సీరియల్స్ సైతం చేశాడు. ప్రస్తుతం యంగ్ హీరోలకు తండ్రిగా సహయ నటుడిగా రాణిస్తున్నాడు. అయితే మీకు తెలుసా.. ? రామ్ జీ… అమృత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె కమల్ హాసన్ కాస్ట్యూమ్ డిజైనర్.. అమృత కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు, కమల్ సినిమాలైన ఇండియన్ 2, తక్ లైఫ్‌లకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆమె తమిళ సినిమాలో కూడా ప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రామ్ జీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..