
బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇతను కూడా ఒకడు. అంతుకు ముందు ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ నటుడు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. నాగచైతన్య శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో కూడా యాక్ట్ చేశాడట. మురళీ శర్మ కాంబోలో కొన్ని సీన్లలో నటించాడట. ఇందుకు డబ్బింగ్ కూడా చెప్పాడట. టైటిల్ రోల్స్ లో పేరు కూడా ఉందట. కానీ చివరాఖరికి సినిమాలో ఇతని సీన్సే లేవట. ఎడిటింగ్ లో అన్నీ లేపేశారట. ఇదే కాదు జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మొగాడివోయ్, కృష్ణార్జున యుద్ధం ఇలా ఎన్నో సినిమాల్లో నటించినా ఎడిటింగ్ లో తీసేశారట. దీంతో చాలా బాధపడ్డానంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మెయిన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నాడు. ఇంతకీ ఆ నటుడు మరెవరో కాదు బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్. ప్రస్తుతం చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు అమర్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు
‘ఒకప్పుడు నా మెంటల్ స్టేటస్ ఒకప్పుడు సరిగ్గా లేదు. ఎక్కువగా ఆలోచించే వాడిని. సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఒక మూడు రోజులు పడుకుంటే మరో మూడు రోజులు సరిగ్గా పడుకొనే వాడిని కాదు. నిద్ర కోసం స్లీపింగ్ టాబ్లెట్స్ వాడాను. యాంగ్జైటీ టాబ్లెట్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాటిని అధిగమించాలని చాలా ట్రై చేస్తున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఒకప్పుడు నేను కొంతమందిని బాధపెట్టి ఉంటాను. అది ఇప్పుడు నాకు రివర్స్ అవుతోంది. ఒకానొక సమయంలో నేను సూసైడ్ కూడా ట్రై చేశాను’ అని చెప్పుకొచ్చాడు అమర్ దీప్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ రన్నరప్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
భార్య తేజస్వినితో బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..