
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగి.. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దదిక్కు స్థానంలో నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ అంటే డాన్స్, మెగాస్టార్ అంటే నటన, మెగాస్టార్ అంటే కామెడీ టైమింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి ఓ పుస్తకమే రాయొచ్చు.. ఆయన నాతో మందికి స్పూర్తి.. ఎంతో మంది ఆయనను స్పూర్తి గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. 150కి పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ ఇప్పటికీ అదే ఎనర్జీతో సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేవలం నటుడిగానే కాదు మెగాస్టార్ చేసే సేవాకార్యక్రమాలు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండస్ట్రీలో చిరంజీవి ఎంతో మందిని ఆదుకున్నారు. కష్టంలో ఉన్నా సాయం చేయండి అనే చాలా మందికి మెగాస్టార్ సాయం చేశారు.
Murali Sharma: ఇదేంది మావ..! ఈ హీరోయిన్ ఈయన భార్య.! అస్సలు ఊహించలేరు
తాజాగా ఓ నటుడు చిరంజీవి తనకు చేసిన సాయం గురించి చాలా గొప్పగా చెప్పారు. నటుడు పొన్నాంబళం గురించి తెలిసే ఉంటుంది.. ఆయన పేరు పెద్దగా తెలియకపోయినా ఆయన ఫోటో చూస్తే టక్కున గుర్తుపట్టేస్తారు. ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్ గా ఓ వెలుగు వెలిగారు పొన్నాంబళం. స్టంట్‌మ్యాన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన విలన్ గా మారారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో సుమారు 1500 వందలకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించారు పొన్నాంబళం.
14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పొన్నాంబళం. తీవ్ర ఆర్థిక సమస్యలకు తోడు కొన్నేళ్ల క్రితం మూత్ర పిండాల వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి నటుడికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఇటీవలే మళ్లీ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పొన్నాంబళం క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తనకు మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయం గురించి తెలిపాడు. నాకు ఆరోగ్యం బాలేనప్పుడు చిరంజీవి గారికి ఫోన్ చేసి సాయం చేయమని అడిగా.. నేను ఆయన లక్షరూపాయలు ఇస్తారేమో అనుకున్నా కానీ ఆయన ఇప్పటివరకు నాకు కోటిరూపాయల వరకు ఇచ్చారు. నా వైద్యానికి ఆయన ఎంతో సాయం చేశారు అని తెలిపాడు పొన్నాంబళం.
11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి