Most Recent

OTT Movie: వామ్మో! చేతబడి ఇలా కూడా చేస్తారా? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యమున్నోళ్లే చూడండి

OTT Movie: వామ్మో! చేతబడి ఇలా కూడా చేస్తారా? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యమున్నోళ్లే చూడండి

గత వారం వివిధ ఓటీటీల వేదికగా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇందులో ఒక సినిమా మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోన్న ఈ మూవీ గత 3 రోజుల నుంచి టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. చేతబడి నేపథ్యంగా తీసుకుని హారర్ థ్రిల్లర్ జానర్ లో ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. జూన్ నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. సినిమా కథ విషయానికి వస్తే.. రాధ అనే మహిళ కుటుంబం చేతబడికి గురవుతుంది. ఆమె ఇంట్లో ఏమాత్రం ప్రశాంతత ఉండదు. సంతోషం లేకుండా బిక్కిబిక్కుమంటూ జీవిస్తుంటుంది. రాధకు భర్త, కుమార్తె ఉంటారు. వారు కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. అసలు రాధ కథేమిటి? ఎవరు ఆమెపై పగబట్టి చేత బడి చేయించారు?చివరకు రాధ కుటుంబం ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ఈ సినిమా పేరు జారన్. ఇది ఒక మరాఠీ సినిమా. జారన్ అంటే మరాఠీలో చేతబడి అనే అర్థం వస్తుంది. ఈ సినిమాలో సేక్రెడ్ గేమ్ సిరీస్ ఫేమ్ హిందీ నటి, అమృత సుభాష్, అనితా కేల్కర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సోనాలీ కులకర్ణి టైటిల్ రోల్ జారన్‌గా నటించింది. జూన్ 6న థియేటర్లలో విడుదలైన జారన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ డీబీలోనూ 7.1 రేటింగ్ కూడా వచ్చింది. . బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ఈ మూవీ ఆగస్టు 08న ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 ఓటీటీలోఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే జారన్ టాప్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇక జీ5లో గత 3 రోజుల నుంచి టాప్ 2 స్థానంలో కొనసాగుతోంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను వీక్షించే వారికి జారన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

జీ 5లో స్ట్రీమింగ్..

జరాన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.