
ప్రస్తుతం పెళ్లి చేసుకున్నవారు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అంటున్నారు. అంతకు మించి అసలు ఆలోచనే లేదంటున్నారు. అయితే బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తోంది. శ్రీదేవి నట వారసురాలిగా ధడక్ సినిమా తో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వీ. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలతో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించిందీ అందాల తార. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది అనే సినిమాలో నటిస్తోంది. కాగా జాన్వీ నటించిన లేటెస్ట్ సినిమా పరం సుంది. సిద్దార్థ్ మల్హోత్రా ఇందులో హీరోగా నటించాడు. ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే సందర్భంగా తన పెళ్లి, పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.
‘నేను పెళ్లి చేసుకున్న తరువాత ముగ్గురు పిల్లలను కనాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మూడు నా లక్కీ నంబర్. అంతేకాదు నా పిల్లల్లో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు, మూడో బిడ్డ వాళ్లలో ఒకరికి సపోర్ట్ గా ఉంటారు. సందర్భాలను బట్టి ఈ సపోర్ట్ మారుతూ ఉంటుంది. ఈ విధంగా నా బిడ్డలందరికీ ఒక తోడు, సపోర్టు దొరుకుతుంది’ అని జాన్వీ చెప్పుకొచ్చింది. కాగా జాన్వీ కపూర్ తన పెళ్లి, భర్త గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు ఇదే తరహా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. జాన్వీ కపూర్ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి తిరుపతిలో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది.
పరమ్ సుందరి సినిమాలో జాన్వీ కపూర్..
View this post on Instagram
జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు బలాన్ని చేకూరుస్తూ ఈ జంట ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు వీరు తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయట పెట్టలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.