
ఏపీ డెప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్ట్రోమ్’ ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ రికార్డులను ఈ సాంగ్ తుడి చేసింది.ఇప్పటికీ ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సాంగ్ లో పవన్ చాలా స్టైలిష్ గా కనిపించారు. తన స్వాగ్ తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాడు. ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడన్న విషయం ఇప్పటికే గ్లింప్స్, సాంగ్ తో అర్థమైంది. ఆయన వెనక ఓ బలమైన గ్యాంగ్ కూడా ఉంటుందని ఫైర్ స్ట్రోమ్ సాంగ్ లో స్పష్టంగా కనిపించింది. అయితే పవన్ గ్యాంగ్ లో ఉన్న ఓ వ్యక్తి బాగా హైలెట్ అయ్యాడు. ఫైర్ స్ట్రోమ్ సాంగ్ లోనూ చాలా సీన్లలో అతను కనిపించాడు. మరి అతనెవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు టాలీవుడ్ ఫేమస్ విలన్ హరీశ్ ఉత్తమన్.
పవర్, గౌరవం, ‘శ్రీమంతుడు, దువ్వాడ జగన్నాథం కృష్ణ గాడి వీర ప్రేమగాథ, ఎక్స్‌ప్రెస్ రాజా, జై లవకుశ’, అశ్వద్ధామ, వినయ విధేయ రామ, వి, నా పేరు సూర్య, నాంది, పుష్ప, విక్రమ్, శాకుంతలం, కంగువా తదితర సినిమాల్లో విలన్ గా నటించాడు హరీశ్ ఉత్తమన్. అయితే ఈ స్టైలిష్ విలన్ భార్య కూడా ఫేమస్ నటినే అన్న విషయం చాలా మందికి తెలియదు.
కుటుంబ సభ్యులతో హరీశ్ ఉత్తమన్..
View this post on Instagram
హరీశ్ ఉత్తమన్ 2018 లోనే మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌పుర్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఏడాదికే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2022 జనవరిలో మలయాళ ప్రముఖ నటి చిన్ను కురువిలను వివాహం చేసుకున్నాడు హరీశ్. చిన్ను ‘నార్త్ 24 కతమ్’, ‘కసాబా’, ‘లుక్కా చుప్పి’ తదితర చిత్రాలతో మలయాళం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హరీశ్- చిన్ను దంపతులకు బాబు ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే చిన్నూ మరోసారి గర్భం దాల్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.