Most Recent

అందాల లతికా ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఇప్పటికీ అదే అందం, అదే వయ్యారం

అందాల లతికా ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! ఇప్పటికీ అదే అందం, అదే వయ్యారం

మాస్ మహా రాజా రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే మనసుకు హత్తుకునే సినిమాలు కూడా ఉన్నాయి. రవితేజ ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు.  వాటిలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా ఒకటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ సినిమాలో రవితేజ అద్భుతంగా నటించి మెప్పించారు. ఎమోషనల్ సీన్స్ లో తన టాలెంట్ అంతా చూపించారు రవితేజ. ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలాగే ఈ మూవీ కథ ప్రతిఒక్కరి జీవితానికి దగ్గరగా ఉంటుంది.. మనకు ఇలానే జరిగింది అనే ఫీల్ కలిగిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ నా ఆటోగ్రాఫ్ ఇప్పటికీ చాలా మంది ఫెవరెట్ మూవీ. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన వారిలో గోపిక గుర్తుందా.? ఆమె క్యారెక్టర్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. మలయాళీ పాత్రలో చాలా సహజంగా నటించి అలరించారు గోపిక. ఆమె అందం , అభినయం స్క్రీన్ మీద అద్భుతంగా చూపించారు. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు.? ఎక్కడ ఉన్నారు.? ఇది తెలుసుకోవడం కోసం నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గోపిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..

గోపిక పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించారు. అలాగే యువసేన సినిమాలో గోపిక హీరోయింగ్ గా చేసి ఆకట్టుకున్నారు. ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ . గోపిక అసలు పేరు గ్లోరీ ఆంటో. గోపిక మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె చివరిగా వీడు మామూలోడు కాదు అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఎక్కడా కనిపించలేదు. పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్నారు గోపిక. 17 జూలై 2008న, గోపిక ఉత్తర ఐర్లాండ్‌లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేష్ చాకోను వివాహం చేసుకుంది . వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.ప్రస్తుతం వీరి కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో స్థిరపడ్డారు.

అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్

Gopika

నా ఆటోగ్రాఫ్.. 

Gopika New

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.