
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తారో, ఎలాంటి టాస్కులు ఉంటాయో, ముఖ్యంగా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ను ఎలా ప్లాన్ చేశారో తెలుసుకునేందుకు తెగ ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపికలో బిగ్ బాస్ యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సామాన్య జనాలు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్ట్ ను ప్రవేశ పెట్టింది. ఈ పోటీ నుంచి మొత్తం ఐదు గురిని బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తీసుకునున్నారు. అలాగే పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ కమెడియన్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పైగా అతను బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు క్లోజ్ ఫ్రెండ్ కూడా. గతంలో హీరోగా, సహాయక నటుడిగా, విలన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇప్పటికీ క్రేజీ మూవీస్ లో యాక్ట్ చేస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ సినిమాలోనూ ఓ పవర్ ఫుల్ రోల్ లో ఈ నటుడు కనిపించనున్నాడు. అయితే అంతుకు ముందే బిగ్ బాస్ షోలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది. అతను మరెవరో కాదు ఆనందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెంకట్.
సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాతో వెంకట్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అన్నపూర్ణ స్టూడియోస్ నే. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. దీని తర్వాత కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కొన్ని సినిమాలు చేశాడు వెంకట్. ఇక మొదటి సినిమా నుంచే నాగార్జునకు మంచి ఫ్రెండ్ గా కూడా మారిపోయడీ హ్యాండ్సమ్ యాక్టర్.
వెంకట్ లేటెస్ట్ ఫొటోస్.
View this post on Instagram
అన్నయ్య, ఆనందం, శివరామరాజు, యువరాజు తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు వెంకట్. మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్నా ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. ఇప్పుడు ఓజీతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.