Most Recent

సుకుమార్ కూతురిని సత్కరించిన సీఎం.. జాతీయ అవార్డు గెలుచుకున్న సుకృతివేణిని అభినందించిన రేవంత్ రెడ్డి

సుకుమార్ కూతురిని సత్కరించిన సీఎం.. జాతీయ అవార్డు గెలుచుకున్న సుకృతివేణిని అభినందించిన రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగు చలనచిత్రసీమకు వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 7 అవార్డులు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, తేజ సజ్జా నటించిన హనుమాన్‌ రెండు అవార్డులు దక్కించుకుంది. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్, ఉత్తమ గాయకుడుగా పి.వి.ఎన్.ఎస్.రోహిత్, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నందు పృథ్వీ, ఉత్తమ బాల నటిగా సుకృతివేణి బండ్రెడ్డి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకృతి వేణితో పాటు ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యెర్నేని నవీన్, రవిశంకర్ ఈమూవీని నిర్మించారు. జనవరిలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి సినిమా అయినా చక్కటి నటనతో ప్రేక్షకులను అలరించింది సుకృతివేణి.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న సుకృతి వేణిని సీఎం రేవంత్ రెడ్డ్ సత్కరించారు. తొలి సినిమాతోనే తన నటనతో జాతీయ అవార్డు అందుకున్న సుకృతి వేణిని, చిత్రయూనిట్ ను సీఎం అభినందించారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 17న జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందుకున్న పలు చిత్రయూనిట్స్ ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సత్కరించారు.

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

 

View this post on Instagram

 

A post shared by SukumarWritings (@sukumarwritings)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.