Most Recent

Jr.NTR: ఎన్టీఆర్ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్.. నీల్ మామా ఈ ఖర్చుతో ఒక సినిమా తీయొచ్చు తెలుసా?

Jr.NTR: ఎన్టీఆర్ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్.. నీల్ మామా ఈ ఖర్చుతో ఒక సినిమా తీయొచ్చు తెలుసా?

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలు చాలా గ్రాండియర్ గా ఉంటాయి. డార్క్ థీమ్ తో సినిమాలు తీయడమంటే ఈ డైరక్టర్ కు చాలా ఇష్టం. ఈ క్రమంలో కేజీఎఫ్ , సలార్ ల తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా చేస్తున్నాడు. తారక్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగ ఈ సినిమా కోసం దాదాపు 15 కోట్ల రూపాయలతో ఓ సెట్ వేస్తున్నారు. ఇది విన్న సినీ అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ‘కాంతార’ లాంటి సినిమా తీయవచ్చు. అవును 400 కోట్లు సాధించిన ‘కాంతార’ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 15 కోట్ల రూపాయలే. ‘వార్ 2’ ప్రమోషన్ కు ముందు, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. అయితే మధ్యలో కొంత విరామం తీసుకుని ‘వార్ 2’ ని ప్రమోట్ చేశాడు. హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో నటించాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఉత్తర కన్నడలోని కుంటాలో జరుగుతోందని తెలుస్తోంది. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ సెట్ నిర్మించారు. 10 రోజులకు పైగా షూటింగ్ ఇక్కడే జరిగింది. ఈ భాగంలో అవుట్‌డోర్ షూటింగ్ జరిగిందో లేదో తెలియదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొంటారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 15 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఇంటి సెట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఈ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఇక ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. వినాయ చవితి తర్వాత తిరిగి అతను ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ కానున్నట్లు సమాచారం. కాగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.