
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్‌బాస్ కు అంతా సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లోనూ త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా భాషల్లో నయా సీజన్లకు సంబంధించిన ప్రోమోలు, గ్లింప్స్ కూడా రిలీజయ్యాయి. కంటెస్టెంట్ల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ హిందీ కొత్త సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. హిందీలో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 18 సీజన్లు పూర్తయ్యాయి. 19వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా నటుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ కొత్త సీజన్ కొత్త లోగో విడుదలైంది. ఇప్పుడు ప్రోమో విడుదలైంది. అలాగే, ‘బిగ్ బాస్ 19’ ప్రీమియర్ తేదీని ప్రకటించారు. హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ ఆగస్టు 24న గ్రాండ్‌గా ప్రారంభమవుతుంది. ఈసారి బిగ్ బాస్ కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రతిసారీ లాగే, ఈసారి కూడా కొన్ని ప్రయోగాలు చేయాలని నిర్ణయించారు. నివేదికల ప్రకారం, బిగ్ బాస్ 19వ సీజన్ సరిగ్గా ఐదున్నర నెలలు కొనసాగుతుంది. గత సంవత్సరం ఇది మూడు లేదా మూడున్నర నెలలు మాత్రమే కొనసాగింది. అయతే ఈసారి, ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్మెంట్ అందించాలని ఏకంగా 5 నెలల పాటు బిగ్ బాస్ షోను రన్ చేయనున్నారు
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు బిగ్ బాస్ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోది. ప్రేక్షకులు కూడా బిగ్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్ల గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. బిగ్ బాస్ 19వ సీజన్ ప్రారంభానికి ఇంకా నెల రోజులు కూడా లేదు. సల్మాన్ ఖాన్ నటించిన ప్రోమో చూసిన తర్వాత అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 కొత్త ప్రోమోలో సల్మాన్ ఖాన్ ఒక రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపిస్తున్నాడు. ‘ఈసారి ఇది హౌస్‌మేట్స్ ప్రభుత్వం’ అని ఆయన అంటున్నారు. దీని ద్వారా, కొత్త సీజన్ థీమ్ గురించి ఆయన హింట్ ఇచ్చారు. బిగ్ బాస్ 19 ‘జియో హాట్ స్టార్’ , ‘కలర్స్’ ఛానెళ్లలో ప్రసారం అవుతుంది.
బిగ్ బాస్ హిందీ సీజన్ 19 లేటెస్ట్ ప్రోమో
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.