Most Recent

Kingdom Twitter Review: కింగ్‏డమ్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Kingdom Twitter Review: కింగ్‏డమ్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

టాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్‏డమ్ సినిమా అడియన్స్ ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్యమైన పాత్రలు పోషించగా.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసినవాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూస్ పంచుకుంటున్నారు. ఇంతకీ ట్విట్టర్ లో రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కింగ్‏డమ్ సినిమాకు యూఎస్ ప్రీమియర్ షోస్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని.. కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారని.. ఇక సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారని.. ఎమోషన్స్, హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకున్నాయి. విజువల్స్, క్యాలీటి పర్ఫెక్ట్ గా ఉన్నాయని.. విజయ్ దేవరకొండ నుంచి ఫ్యాన్స్ ఊహించిన దానికంటే హై లెవల్లో మాస్ యాక్షన్ ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో జైలు సీన్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అని అంటున్నారు. సెకండాఫ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉందని ట్విట్టర్ లో తెలుపుతున్నారు. ఎప్పటిలాగే అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టగా.. విజయ్ మాస్ హీరోగా ఇరగదీశాడని అంటున్నారు. ఇక మంచి కథ రాసుకోడమే కాకుండా.. ఎమోషన్స్ తోపాటు యాక్షన్ సైతం బ్యాలన్సుడ్ గా హ్యాండిల్ చేశారని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.. 

ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.