Most Recent

Actress: టాప్ హీరోయిన్లకే చుక్కలు చూపిస్తున్న అమ్మడు.. ఒక్క సీన్‏తో ఫేమస్.. కట్ చేస్తే.. 900 కోట్ల స్టార్..

Actress: టాప్ హీరోయిన్లకే చుక్కలు చూపిస్తున్న అమ్మడు.. ఒక్క సీన్‏తో ఫేమస్.. కట్ చేస్తే.. 900 కోట్ల స్టార్..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. యూట్యూబ్ వీడియోస్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. ఏకంగా 900 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. దాదాపు ఒక దశాబ్దంపాటు ఆడిషన్స్ చేసింది. అయినప్పటికీ తిరస్కరణలు ఎదుర్కొంది. ఆమెకు ఎప్పుడు పెద్ద ఛాన్స్ రాలేదు. ఓర్పు, సహనం, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు చేసింది. చివరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు ఎంపికైంది. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా ఆఫర్స్ సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోడిగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. త్రిప్తి డిమ్రి.

బుల్బుల్, ఖాలా, లైలా మజ్ను సినిమాలతో కథానాయికగా ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు ఆమెను రిజెక్ట్ చేసిన మేకర్స్.. ఆ తర్వాత పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. హిందీలో వరుసగా చిన్న సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో జోయా పాత్రతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఈ మూవీలో ఆమె పోషించింది చిన్న పాత్రే అయినప్పటికీ ఒక్కసారిగా పాన్ ఇండియా నేషనల్ క్రష్ గా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

అంతేకాదు.. భారతదేశంలో గూగుల్ లో అత్యధికంగా వెతికిన కథానాయికగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఢిల్లీలో జన్మించిన ఈ పహాడీ అమ్మాయి.. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి కనబరిచింది. చిన్నప్పుడు రామ్‌లీలా ప్రదర్శనలో మంత్రగత్తెగా కనిపించింది. తన బంధువు సూచనతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్ లలో ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ సరసన స్పిరిట్ చిత్రంలో నటించనుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..

Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.