
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తన టాలెంట్‌తో బిగ్ స్టార్‌గా ఎదిగిన నటుడు. యూత్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్ గురించి కొత్త చెప్పేందేముంది కానీ, ఓ మీటింగ్లో జరిగిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించిన ఓ మీటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. అంతే సభ దద్దరిల్లిపోయింది. హైదరాబాద్ ఎంపీగా, ఎంఐఎం అధినేతగా ఒవైసీని చాలా మంది రాజకీయా నిపుణులు ముస్లిం, మైనర్టీలకు ప్రతినిధిగా భావిస్తారు. మరి అలాంటి నాయకుడు ప్రసంగించిన సభలో ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆయన పేరు చెప్పగానే సభ ఎందుకు దద్దరిల్లింది? ఆ రియాక్షన్‌కు ఒవైసీ ఇచ్చిన రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
వక్ఫ్ బోర్డు, వక్ఫ్ భూములు, వక్ఫ్ చట్టంపై ఎంఐఎం కర్నూలులోని ఆధోనిలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఒవైసీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ ఎంతో తనకు ఎంతో గౌరవమని, తనకు చాలా మంది సన్నిహితులు ఆ పార్టీలో ఉన్నారని అసదుద్దీన్ అన్నారు. అయితే టీడీపీ బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పుకుని, యువనేత నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
తన కుమారుడు లోకేష్ రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని, దయచేసి తాను చేసే సూచనను పాటించాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “లోకేష్ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, ఎలాగూ మీరు జూనియర్ ఎన్టీఆర్‌ను రానివ్వరు?” అని అన్నారు. అలా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తడంతోనే అక్కడున్న వారు గట్టిగా అరవడంతో అసదుద్దీన్ షాకయ్యారు. జూనియర్ ఎన్టీఆర్‌కు అంత పాపులారిటీ ఉందా, నాకు తెలియదని వ్యాఖ్యానించారు. టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టే ఛాన్స్ ఉందా? అది జరుగుతుందా? అని ఆయన అక్కడున్న వారికి కూడా ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి