
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల లిస్ట్ లో అడవిశేష్ ముందు వరసలో ఉంటాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. కాగా అడవి శేష్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. అడవి శేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే కర్మ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో కామియో చేశాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గూఢచారి, హిట్ 2, ఎవరు, మేజర్, సినిమాలతో హిట్స్ అందుకున్నాడు శేష్. త్వరలోనే మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అడవి శేష్.
ఇటీవలే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు శేష్. ప్రస్తుతం గూఢచారి 2 సినిమాతో పాటు డెకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అడవి శేష్ ఓ టీవీ షోకు హాజరయ్యాడు. డాన్స్ షోకు అడవి శేష్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ షోలో ఉన్న బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శేష్ ను చూసి షాక్ అయ్యింది. శేష్ ను చూసి సర్ ప్రైజ్ అయిన అశ్విని శ్రీ.. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్‌కు చెప్పింది.
మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని అశ్విని చెప్పగానే .. శేష్ కూడా నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆతర్వాత మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది అని చెప్పి షాక్ ఇచ్చింది. దాంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అని అశ్విని చెప్పగానే శేష్ అవాక్ అయ్యాడు. ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి శేష్ నవ్వుతూ సరే సరే అంటూ ఆపేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి