Most Recent

అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్

అందం ఎక్కువైంది.. ఆఫర్ మిస్ అయ్యింది..! బడా సినిమా నుంచి స్టార్ హీరోయిన్ అవుట్

చాలా మంది హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో బడా సినిమాల్లో ఛాన్స్ లు వస్తే ఎగిరి గంతేస్తారు.. కానీ కొంతమంది హీరోయిన్స్ అందం కారణంగా కొన్నిసార్లు అవకాశాలు మిస్ అవుతూ ఉంటారు. అందంగా లేరు అని కొంతమందికి క్రేజీ ఆఫర్స్ మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆకర్షణీయంగా లేరు అని , బొద్దుగా ఉన్నారని సినిమా ఆఫర్స్ మిస్ అయిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కు విచిత్రమైన సమస్య ఎదురైందని తెలుస్తుంది. ఆమె అందమే ఆమెకు బడా సినిమా ఆఫర్ మిస్ అయ్యేలా చేసిందని టాక్ వినిపిస్తుంది. అందంగా ఉండటంతో పాటు ఆమెకు స్టార్ డమ్ ఉండటంతో ఓ పెద్ద సినిమా నుంచి ఆమెను తప్పించారని టాక్ వినిపిస్తుంది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో కాదు..

ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. తెలుగులో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గ ఎదిగిన వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడు లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు వచ్చిన ఈ చిన్నది ఆతర్వాత వరుస సినిమాలతో స్టార్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ బడా హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది. దాంతో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీలో అదరగొడుతుంది.

ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్

ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఇటీవల రామాయణం సినిమాలో నటిస్తుందని ఇటీవలే అనౌన్స్ చేశారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుంది. కన్నడ రాక్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. కాగా ఇదే సినిమాలో కాజల్ అగర్వాల్.. రావణుడి భార్య మండోదరీ పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. అయితే రావణుడు సీతపై కన్నేసి ఆమెను పెళ్లాడాలని భావిస్తాడు. అయితే కాజల్ లాంటి అందగత్తెను ఇంట్లో పెట్టుకొని సాయి పల్లవి పై రావణుడు కన్నేయడం పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కాజల్ ను మండోదరిగా ఉహించుకోలేకపోతున్నాం అంటూ నెటిజన్స్ ట్రోల్ చేశారు. దాంతో ఇప్పుడు కాజల్ అగర్వాల్ ను సినిమా నుంచి తప్పించారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కాజల్ అందమే అను బడా సినిమా ఆఫర్ మిస్ అయ్యేలా చేసిందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.