
తే;తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అస్వస్థత తో భాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా రెండేళ్ళ క్రితం వరకూ సినిమాల్లో నటించారు. ఆయనా చివరి సినిమా 2023లో రిలీజైన ‘సువర్ణ సుందరి’.
గత నాలుగూదశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 750 కు పైగా చిత్రాల్లో నటించారు. కోట మృతిలో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కోట శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జూలై 10 న జన్మించారు. కోటా శ్రీనివాస్ తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్నా.. చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగు పెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగి.. డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా.. నటననే వృత్తిగా చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించాడు.
కోట శ్రీనివాసరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకం అని చెప్పవచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రలో నటించేవారు కాదు జీవించేవారు అని చెప్పవచ్చు. అహనా పెళ్ళంట లో పిసినారిగా, గణేష్ సినిమాలో రాజకీయ వేత్తగా ఇలా ఏ పాత్రలో నైనా తనదైనశైలితో నటించేవారు. అవును ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విలన్ పాత్రల్లోనే లోనే హాస్యాన్ని పండించడంలో కోటా దిట్ట.
కోటా శ్రీనివాసరావు భార్య రుక్మీణి.. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కోటా శ్రీనివాస్ తనయుడు తండ్రి బాటలో సినిమాల్లో అడుగు పెట్టినా ..అదే సమయంలోనే ఒక యాక్సిడెంట్ లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొడుకు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కాగా కోటా తమ్ముడు శంకర్ రావు కూడా నటుడే
కోటా శ్రీనివాస్ నటుడు మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..