Most Recent

బిగ్‌ బ్రేకింగ్‌: నిఖిల్‌ సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం!

బిగ్‌ బ్రేకింగ్‌: నిఖిల్‌ సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం!

టాలీవుడ్‌ ప్రముఖ హీరో నిఖిల్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్‌కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. శంషాబాద్‌లో “ది ఇండియన్‌ హౌజ్‌” సినిమా షూటింగ్‌ జరుగుతుండగా.. వాటర్‌ ట్యాంకర్‌ పేలిపోవడంతో ఒక్కసారిగా లోకేషన్‌ మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలు కాగా.. మరికొంత మందికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.