Most Recent

Smriti Irani: ఏంటీ.. స్మృతి ఇరానీ తెలుగు సినిమాలో నటించారా? అది కూడా ఒక పవర్ ఫుల్ రోల్‌లో.. ఏ మూవీనో తెలుసా?

Smriti Irani: ఏంటీ.. స్మృతి ఇరానీ తెలుగు సినిమాలో నటించారా? అది కూడా ఒక పవర్ ఫుల్ రోల్‌లో.. ఏ మూవీనో తెలుసా?

‘క్యుంకీ సాస్ బి కభీ బహు థీ’.. భారతీయ టెలివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఈ సీరియల్ కూడా ఒకటి. 2000లో ప్రారంభమైన ఈ సీరియల్ సుమారు 8 ఏళ్ల పాటు అంటే 2008 వరకు కొనసాగింది. ఇదే సీరియల్ లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు స్మృతి ఇరానీ ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఇందులో ఆమె తులసి విరానీ పాత్రను పోషించి ఇంటిల్లి పాదికి చేరువయ్యారు. అయితే రాజకీయాల్లో బిజీ అయిపోయిన స్మృతి రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె మళ్లీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు.
తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన క్యుంకీ సాస్ బి కభీ బహు థీ సీరియల్ రెండో సీజన్ తోనే మళ్లీ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చారు. క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ 2 ఈ నెల 29 నుంచి ప్రసారం కానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం విడుదలైన స్మృతి ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. స్మృతి ఇరానీ చివరిసారిగా 2013లో ఒక సీరియల్‌లో నటించారు. ఆ తర్వాత నటనకు పూర్తిగా దూరమయ్యారు.

స్మృతి ఇరానీ బాలీవుడ్ సీరియల్స్ తో పాటు ఓ తెలుగు సినిమాలోనూ నటించారన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2011లో వచ్చిన చిత్రం జైబోలో తెలంగాణ. 2009లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అల్లకల్లోలమైన రోజులు, పోలీసుల లాఠీ ఛార్జీ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం స్టూడెంట్స్ ఆత్మహత్యలు, యదార్థ సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా నంది అవార్డులను గెలుచుకుంది. డైరెక్టర్ ఎన్. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో గోపన్నగా జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ఆయన భార్య జయమ్మ పాత్రలో స్మృతి ఇరాని నటించడం విశేషం. సినిమాలో జగపతి బాబు తర్వాత పవర్ ఫుల్ రోల్ స్మృతిదే. ఇందులో ఆమె నటనకు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో వృద్ధురాలిగా కనిపించేందుకు తన జుట్టుకు తెల్ల రంగు సైతం వేసుకున్నారు. అయితే అప్పట్లో చాలా మంది ఆమెను గుర్తు పట్టలేకపోయారు.

జై బోలో తెలంగాణ సినిమాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరాని

Smriti Irani 1

Smriti Irani 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.