
రీసెంట్ డేస్ లో సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు యాంకర్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరమీద రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. అలాగే అనసూయ, రష్మీ ఇలా ఇంకొంతమంది కూడా ఉన్నారు. అయితే బుల్లితెర అతిలోక సుందరి పేరుతెచ్చుకున్న యాంకర్ గుర్తుందా.? ఆమె ఎవరో కాదు.. ఉదయభాను. ఈ అందాల యాంకర్‌ను అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకప్పుడు తన మాటలతో.. అందంతో, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించింది ఉదయభాను. యాంకర్‌గా చేసిన మొదటి కార్యక్రమంతోనే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది ఉదయభాను.
ఇది కూడా చదవండి : అక్క స్టార్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలకు దూరంగా ఇలా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆతర్వాత చాలా కార్యక్రమాలకు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా , డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా పాపులర్ షోల్లో యాంకర్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది ఉదయభాను. ఇక చాలా కాలంగా యాంకరింగ్ కు దూరంగా ఉంటున్న ఉదయభాను రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ ను హోస్ట్ చేశారు. కాగా ఆ సినిమా ఈవెంట్ వేదిక పై ఉదయభాను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి : 1000కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. కానీ చిన్నకారులో తిరుగుతున్నముద్దుగుమ్మ
ఓ భామ అయ్యో రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉదయభాను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మళ్లీ నేను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో తెలియదని.. ఇక్కడో పెద్ద సిండికేట్ ఏర్పడిపోయిందని అంటూ స్టేజ్ పైనే అసంతృప్తి వ్యక్తం చేసింది ఉదయభాను. ఓ భామ అయ్యో రామ ప్రీరిలీజ్ ఈవెంట్ కు విజయ్ కనక మేడల గెస్ట్ గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయభాను గారు చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారు అన్నాడు. దాంతో ఉదయభాను మాట్లాడుతూ.. ఇదొక్కటే చేశానండీ.. మళ్లీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు. రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ.. చేసేరోజుకి మనికి ఈవెంట్ ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో. హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం… మనసులో మాట కాబట్టే చెప్తున్నా” అంటూ ఉదయభాను అసహనం వ్యక్తం చేశారు. అలాగే రచయిత, నటుడు మచ్చ రవి మాట్లాడుతూ.. ఉదయభాను మైక్ పట్టుకుంటే.. ఒక నారి వంద తుపాకుల టైప్ అని అన్నారు. ఆ మాటతో ఉదయభాను.. ‘నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికీ తెలియదు’ అంటూ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఎవరు పడితే ఎవరు యాంకరింగ్ చేస్తున్నారు.. ఉదయభాను ఎప్పటికీ మా అభిమాన యాంకర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇది కూడా చదవండి :మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.