
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్యల మధ్య వివాదం రోజు రోజుకీ ముదురుతుంది. గత కొన్నాళ్లుగా సద్దుమణిగిందనుకున్న ఈ గొడవ ఇప్పుడు మళ్లీ మొదలైంది. ప్రస్తుతం లావణ్య ఉంటోన్న ఇల్లు తమదేనంటూ బుధవారం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమ లగేజ్‌తో సహా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత లావణ్య తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే లావణ్య, రాజ్ పేరెంట్స్ మధ్య గొడవ చోటు చేసుకుంది. దీనిపై మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని ఆరోపించింది. తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చి దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని గురించి చర్చ జరుగుతుండగానే లావణ్య మరో సంచలన వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతోన్న ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద లావణ్య- రాజ్ తరుణ్ జంటగా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అంతేకాదు అందరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించారు.దీంతో వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఇది పాత వీడియోనా, కొత్తదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.
పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తా.. లావణ్య హెచ్చరిక..
అంతకు ముందు నార్సింగ్ పీఎస్‌కు వచ్చిన లావణ్య తన కేసు గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయింది. ‘నిన్న రాత్రి కూడా కొంత మంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు. రాజ్ తరుణ్, అతడి తల్లితండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని.. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదు’ అంటూ ఎమోషనలైంది లావణ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో లావణ్య… వీడియో
సంచలన వీడియో రిలీజ్ చేసిన లావణ్య
తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్- లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్. లావణ్య సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద లావణ్య రాజ్ తరుణ్ ఆశీర్వాదం… https://t.co/DKVItXtbb6 pic.twitter.com/XIea7BBeCL
— ChotaNews App (@ChotaNewsApp) April 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.