
ప్రముఖ నటి రష్మీ గౌతమ్ ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజి బిజీగా ఉంటోంది. అప్పుడుప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తోంది. అయితే ఈ మధ్యన తరచూ అనారోగ్యం పాలవుతోంది అందాల తార. ఆ మధ్యన భుజం గాయంతో ఆస్పత్రి పాలైన రష్మీ అందుకు సర్జరీ కూడా చేయించుకుంది. తాజాగా మరోసారి అనారోగ్యం పాలైందీ జబర్దస్త్ బ్యూటీ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. ‘గత కొన్ని రోజులుగా నా హెల్త్ ఏమీ బాగుండడం లేదు. జనవరి నుంచి కంటిన్యూగా రక్తస్రావం అవుతోంది. భుజాలు కూడా చాలా నొప్పి పెట్టాయి. ఆ బాధను భరించలేకపోయాను. అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్‌ను కన్సల్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఎలాగోలా మార్చి 29 వరకు మ్యానేజ్ చేశాను. కానీ ఆ తర్వాత నా ఆరోగ్యానికి ఏదో తేడా కొడుతోందన్న అనుమానం కూడా వచ్చింది. అందుకే త్వరగా నా కమిట్మెంట్లను పూర్తి చేసుకున్నాను.
‘ ఉన్నట్లుండి విపరీతంగా రక్త స్రావం, ఒళ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయి. చివరకు తన హీమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయింది. ఏం జరుగుతోందో అర్థం కాక ఇలా హాస్పిటల్‌లో చేరాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ అయింది. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ఈ ఐదు రోజులు నాకు తోడుగా ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాస్పిటల్ టీంకు స్పెషల్ థాంక్స్. ఇంకా కొన్ని రోజులు ఇలానే రెస్ట్ మోడ్‌లో ఉండక తప్పడం లేదు. అంతా సెట్ అయ్యాక మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తాను’ అంటూ రాసుకొచ్చింది రష్మీ గౌతమ్. అయితే అసలు తనకు వచ్చిన సమస్య ఏంటన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు రష్మీ గౌతమ్.
ఆస్పత్రిలో యాంకర్ రష్మీ గౌతమ్..
View this post on Instagram
ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీటిని చూసిన బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రష్మీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఏమైందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
యాంకర్ రష్మీ గౌతమ్ గ్లామరస్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.