
అది ఒక పాడుబడిన ఇల్లు.. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఎవ్వరూ పెద్దగా సాహసం చేయరు. రెగ్యులర్ గా ఆ ఇంటి ముందు నుంచి చాలా మంది సంచరిస్తూ ఉంటారు.. కానీ ఆ ఇంటి వైపు తొంగి చూడరు.. కానీ అనుకోకుండా ఆ ఇంట్లో నుంచి శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఆ ఇంట్లో ఎవరో ఏడుస్తున్నటు శబ్దాలు వినపడటం మొదలయ్యాయి. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన ఓ స్టార్ హీరోయిన్ చెల్లికి ఆ ఏడుపు వినిపించింది. ఆ ఇంట్లోకి వెళ్లే మార్గం సరిగా లేకపోయినా చిన్న పాటి సాహసం చేసి మరీ ఆ ఇంట్లోకి వెళ్ళింది. అక్కడి సీన్ చూసి ఆమె షాక్ అయింది. ఆతర్వాత ఆమె చేసిన పనికి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఇంతకూ ఆమె చేసిన సాహసం ఏంటి.? ఆఆ ఇంట్లో ఏముందంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో నివాసం ఉంటుంది.. హీరోయిన్ దిశాపటాని సిస్టర్ ఖుష్బూ పటాని. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా దూసుకుపోతుంది అందాల భామ దిశా పటాని వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే దిశా పటాని సోదరి ఆర్మ్ అధికారి అని చాలా మందికి తెలియక పోవచ్చు. ఖుష్బూ పటాని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆమె తాజాగా షేర్ చేసిన ప్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విషయం ఏంటంటే.. ఇటీవల ఉదయాన్నే ఖుష్బూ పటాని వాకింగ్ కు వెళ్తున్న సమయంలో ఓ శిధిలమైన ఇంట్లో నుంచి ఏడుపు వినిపించింది.
ఆ ఇంట్లోకి వెళ్లే సాహసం ఎవరు చేయకపోయినా.. ఖుష్బూ పటాని అక్కడ ఉన్న ఓ పెద్ద గోడను దూకి లోపలి వెళ్ళింది. ఆ ఇంట్లో ఓ చిన్నారి ఏడుస్తూ కనిపించింది. మట్టికొట్టుకుపోయిన బట్టలతో ఆ చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఆ పాపను అక్కడి నుంచి కాపాడి లాలిస్తూ ఆమెను ఇంటికి తీసుకెళ్లారు ఖుష్బూ . బాటిల్ తో ఆ చిన్నారికి పాలు పట్టించి ఆకలి తీర్చారు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆ పాప తల్లిదండ్రుల పై మండిపడ్డారు ఖుష్బూ పటాని. ఆ చిన్నారిని గుర్తుపడితే చెప్పాలని కోరారు సోషల్ మీడియాలో కోరారు ఖుష్బూ. ఆతర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి వంటిమీద చిన్న చిన్న గాయాలు ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆతర్వాత మరో పోస్ట్ లో ఆ చిన్నారి పేరు రాధ అని, ఆమె పేరెంట్స్ ను పోలీసులు గుర్తించారని మరో పోస్ట్ షేర్ చేశారు ఖుష్బూ. అలాగే ఇదొక కిడ్నప్ కేసు అని ఆమె తెలిపారు. పోలీసులు దీని పై దర్యాప్తు చేస్తున్నారు. ఖుష్బూ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram
ఖుష్బూ పటాని.. ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.