Most Recent

Pokiri Movie: అరెరే.. క్రేజీ ఛాన్స్ మిస్సయ్యావు కదన్నా.. పోకిరి సినిమాను ఆ హీరో కోసం రాసుకున్న పూరి.. చివరకు..

Pokiri Movie: అరెరే.. క్రేజీ ఛాన్స్ మిస్సయ్యావు కదన్నా.. పోకిరి సినిమాను ఆ హీరో కోసం రాసుకున్న పూరి.. చివరకు..

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మలుపు తిప్పిన చిత్రాల్లో పోకిరి ఒకటి. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న మహేష్.. ఈ సినిమాతో మాస్ యాక్షన్ హీరోగానూ దుమ్మురేపాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అప్పట్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. మహేష్, పూరిల కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్లలో రికార్డ్స్ తిరగరాసింది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల రీరిలీజ్ అయిన బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచనలం సృష్టించింది. ఈ సినిమా విడుదలై ఏప్రిల్ 28 నాటికి 19 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా 2006లో విడుదలైన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా కథను పూరి రాసుకుంది మహేష్ కోసం కాదట. ఈ మూవీ విడుదలకు ఆరేళ్ల ముందుగానే తన తొలి చిత్రం బద్రి కన్నా ముందే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట. ముందుగా ఈ చిత్రానికి హీరోగా మాస్ మాహరాజా రవితేజను అనుకున్నారట. ఉత్తమ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ తో రవితేజ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారట. కానీ కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కొన్నాళ్ల తర్వాత ఇదే స్టోరీ మహేష్ వద్దకు వెళ్లింది. ఇక మహేష్ హీరోగా అనుకున్నాక స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి పోకిరి టైటిల్ తో తెరకెక్కించారట పూరి.

అలాగే ఈ సినిమాలో మహేష్ సరసన ముందుగా అనుకున్న హీరోయిన్ అయేషా టకియా. కానీ ఆమె కొన్ని కారణాలతో ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో చివరకు ఆఫర్ బాలీవుడ్ క్వీన్ కంగనా వద్దకు చేరింది. కానీ అప్పటికే ఆమె బాలీవుడ్ మూవీ గ్యాంగ్ స్టర్ కు సెలక్ట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ వదులుకుంది. చివరకు ఈ సినిమా ఛాన్స్ ఇలియానాను వరించింది. ఈ మూవీతో అటు మహేష్.. ఇటు ఇలియానాకు మంచి క్రేజ్ వచ్చేసింది. వీరిద్దరి జోడి, కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.