
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యారు. కొన్ని నెలలుగా ఈ మూవీ కోసం ముంబైలో సందడి చేశారు ఎన్టీఆర్. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో తారక్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. అలాగే ఇప్పటివరకు కనిపించని లుక్, రోల్లో ఎన్టీఆర్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా.. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు తారక్. ఏప్రిల్ 22న ఈ సినిమా షూటింగ్ సెట్ లో అడుగుపెట్టారు. నీల్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.
ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ మంగళవారం ప్రకటించారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. అందులో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా కనిపించనుందని సమాచారం. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇప్పటివరకు ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాల్లో ఈ మూవీని మరింత హిట్ చేయాలని భావిస్తున్నారట ప్రశాంత్ నీల్.
అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకున్నారట. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు మించి ఎన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్ మూవీ ఉండనుందని టాక్. తారక్ నటించిన సినిమాలన్నింటిలోనూ ఇదే బెస్ట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో తారక్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..