
సినిమా ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవ్వరిని చూసిన విడిపోతున్నాం అంటూ అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్ విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించి అభిమానులకు ఆందోళనకు గురి చేస్తున్నారు. కాగా రీసెంట్ గా నజీమ్ నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ విడిపోతున్నటు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. గతకొద్ది రోజులుగా నజ్రియా నజీమ్ ఎవ్వరికీ టచ్ లో లేరు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేరు.. దాంతో ఆమె ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యింది అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో పో పోస్ట్ షేర్ చేస్తూ వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు సైలెంట్ అయ్యాను అని తెలిపింది.
దాంతో నజ్రియా నజీమ్ కు ఏమైంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మానసికంగా, వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొంటున్నాను. అందుకే జనాల్లో కలవడం లేదు అని నజ్రియా నజీమ్ తెలిపింది. అలాగే ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేను ఈ మధ్య డిప్రషన్ లోకి వెళ్ళాను అని తెలిపింది. దాంతో నజ్రియా నజీమ్ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది.? ఫహద్ తో విడిపోతుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్ పెళ్లి చేసుకోవడానికి ఓ స్టార్ హీరోయిన్ కారణం అని మీకు తెలుసా.?
అవును ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఓ హీరోయిన్ కారణం.. ఆమె ఎవరో కాదు అందాల భామ నిత్యామీనన్. ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్, దుల్కర్ సల్మాన్ , నివిన్ పౌలీ కలిసి నటించిన సినిమా బెంగుళూరు డేస్. ఈ సినిమాలో నిత్యామీనన్ కీలక పాత్రలో నటించింది. బెంగుళూరు డేస్ సినిమాలో ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ భార్యాభర్తలుగా నటించారు. అయితే ముందుగా నజ్రియా రోల్ నిత్యా, నిత్యా రోల్ నజ్రియా చేయాలట.. కానీ నిత్యామీనన్ అప్పుడు బిజీగా ఉండటంతో, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఇద్దరి ప్లేస్ లు మారిపోయాయట.. అయితే ఆ సినిమా సమయంలోనే ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ ప్రేమలో పడ్డారు. నిత్యా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా వల్లే ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ పెళ్లి జరిగింది, ఆ రోజు నేను ఆమె పాత్ర చేసి ఉంటే ఆ ఇద్దరూ లవ్ లో పడేవారు కాదేమో అని సరదాగా అన్నారు నిత్య. కాగా పెళ్లి సమయానికి నజ్రియా వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే .. అలాగే ఫహద్ ఫాజిల్ కు 32 ఏళ్లు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.