
నితిన్ ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. చివరిగా నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. గతంలో నితిన్ వరుసగా 13 సినిమాలు ఫ్లాప్స్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సై సినిమా తర్వాత సక్సెస్ అందుకోవడానికి చాలా కష్టపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇష్క్ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరూ హిట్ పెయిర్ గా నిలిచారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన మరో సూపర్ హిట్ మూవీ గుండెజారి గల్లంతయ్యిందే. 2013లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు విజయ్ కుమార్ దర్శకతం వహించారు. ఈ మూవీలో నిత్యామీనన్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె పేరు ఇషా తల్వార్. అలాగే గుత్తా జ్వాలా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన ఇషా తల్వార్ తెలుగులో పెద్దగా రాణించలేకపోయింది. అయితే గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఇషా తల్వార్ పాత్రకు కూడా నిత్యామీనననే డబ్బింగ్ చెప్పింది. అయితే ఇప్పుడు ఇషా తల్వార్ ఎలా ఉంది. ? ఎక్కడ ఉంది.? ఇప్పుడు ఏం చేస్తోంది .? అని నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు.
ఇషా తల్వార్ తండ్రి కూడా బాలీవుడ్ నటుడు. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. ఇక హీరోయిన్ గా సినిమాలు మాత్రం మాలీవుడ్ లో చేసింది. తట్టతిన్ మరయతు అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మైనే ప్యార్ కియా, రాజా చెయ్యి వేస్తే అనే సినిమాలు మాత్రమే తెలుగులో చేసింది. ఆతర్వాత మలయాళంలో హిందీలో సినిమాలు చేసింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఫుల్ బిజీగా ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ అమ్మడు అంతే అందంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.