Most Recent

Laapataa Ladies: వివాదంలో ఆస్కార్ నామినేటెడ్ మూవీ లాపతా లేడీస్.. ఆమిర్ ఖాన్ మాజీ భార్య అంత పని చేసిందా?

Laapataa Ladies: వివాదంలో ఆస్కార్ నామినేటెడ్ మూవీ లాపతా లేడీస్.. ఆమిర్ ఖాన్ మాజీ భార్య అంత పని చేసిందా?

ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ సినిమాపై సంచలన ఆరోపణలు వవస్తున్నాయి. ఈ సినిమా కథను ఒక అరబిక్ షార్ట్ ఫిల్మ్ నుంచి దొంగిలించి తీశారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అందుకు నిదర్శనంగా ఒక వీడియో కూడా ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. లాపతా లేడీస్’ సినిమా కథను అరబిక్ భాషా షార్ట్ ఫిల్మ్ ‘బుర్కా సిటీ’ నుండి దొంగిలించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ‘బుర్కా సిటీ’ అనే లఘు చిత్రంలో’మిస్సింగ్ లేడీస్’ సినిమా కథను అరబిక్ భాషా షార్ట్ ఫిల్మ్ ‘బుర్కా సిటీ’ నుండి దొంగిలించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. 2019 లో వచ్చిన బూర్ఖా సిటీ షార్ట్ ఫిల్మ్ కథతో పాటు కొన్ని సన్ని వేశాలు కిరణ్ రావు ‘లపాతా లేడీస్’ సినిమాకు చాలా దగ్గరగా ఉంటాయంటున్నారు. దీంతో ఈ ఆస్కార్ నామినేటెడ్ మూవీ బుర్ఖా సిటీ అరబ్ సినిమాకు అనధికారిక రీమేక్ అంటూ నెట్టింట పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి
బుర్కా సిటీ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన కొన్ని క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇందులోని పాత్రలు, సన్ని వేశాలు లాపతా లేడీస్ సినిమాతో పోలుస్తున్నారు నెటిజన్లు. ఇక రవి కిషన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర లాగే, ‘బుర్కా సిటీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

‘బుర్కా సిటీ’ అనే షార్ట్ ఫిల్మ్ 2019లో విడుదలైంది. ‘లపాతా లేడీస్’ సినిమా మార్చి 1, 2024న విడుదలైంది. ఈ రెండు సినిమాల సందేశం ఒకే విధంగా ఉంది. పురుషాధిక్య సమాజం మహిళలను ఎలా చూస్తుందో ఈ సినిమాలు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఈ కారణంగానే ‘లపాతా లేడీస్’ సినిమా కథ కాపీ కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ కాపీ ఆరోపణపై దర్శకురాలు కిరణ్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.

నెట్టింట వైరలవుతోన్న వీడియో క్లిప్ ఇదే..

నటుడు ఆమిర్ ఖాన్ ‘లపాత లేడీస్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.