
ప్రస్తుతం చాట్ జీపిటీలో గిబిలి స్టైల్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా మారాయి. చాట్ జీపిటీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక కృతిమ మేధ. ఇప్పుడు ఇందులో అందుబాటులోకి వచ్చిన ఏఐ గిబిలి ఫోటోలకు జనాల నుంచి విపరీతమైన క్రేజ్ వస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు ఈ చాట్ జీపిటీ ద్వారా గిబ్లీ కళను ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ఫోటోనైనా సరే యానిమేషన్లోకి మార్చడం ఈ ఏఐ ప్రత్యేకత. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసిన గిబిలి ఆర్ట్ ఫోటోస్ ప్రత్యేక్షమవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ సైతం గిబిలి ఆర్ట్ ఉపయోగించి తమ ఫోటోలను యానిమేషన్లోకి మార్చుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ టాప్ హీరోయిన్ సైతం తన ఫోటోను గిబిలి ఆర్ట్ లోకి మార్చేసింది. పైన ఫోటోను చూశారు కదా.. గ్రీన్ డ్రెస్లో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? చాట్ జీపిటీ ఏఐకి సైతం మతిపోగొట్టేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? దక్షిణాదిలో ఆమె టాప్ హీరోయిన్.
తెలుగులో ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవలే తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తుంది. ఒకప్పుడు పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. మహానటి కీర్తి సురేష్.
తాజాగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఏఐ చాట్ జీపిటీ క్రియేట్ చేస్తున్న గిబిలి ఫోటోలను షేర్ చేసింది కీర్తి. తాజాగా ఆమె ఫోటోస్ నెట్టింట ఆక్టటుకుంటున్నాయి. ఈ ఫోటోస్ చూసి బ్యూటీఫుల్.. క్యూటీ అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో నార్త్ అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు హిందీలో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..