
సినీ ఇండస్ట్రీకి పైరసీ పెనుభూతంగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీకి అడ్డుకట్ట పడకపోవడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్త కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయిన గంటల్లోనే పైరసీకి గురవుతుండడంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. దాంతో.. సినిమా వర్గాలు పైరసీ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే.. కీలక విషయాలు వెల్లడించారు సినీ నిర్మాత నాగవంశీ. పైరసీ పెద్ద సమస్యగా మారిందన్నారు ఇటీవల రిలీజ్ అయిన మ్యాడ్-2 పైరసీ కాపీని చెక్ చేశామని.. ఓవర్సీస్ కాపీ లీక్ అయినట్టు గుర్తించామని చెప్పారు. కొన్ని దేశాల్లో సెన్సార్ కావాలని.. దానికి కోసం పంపిన కాపీలు లీక్ అయినట్లు ఐడెంటిఫై అయిందన్నారు. దీనికి సంబంధించి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు అలెర్ట్ చేశామని.. ఈ సారి ఓవర్సీస్ సెన్సార్‌కి పంపేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.
పైరసీని ఇలాగే వదిలేస్తే డేంజర్ లెవెల్లో డ్యామేజ్ జరుగుతుందని.. అందుకే.. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ట్రాక్ చేస్తున్నామన్నారు. పైరసీ విషయాన్ని ఎఫ్‌డీసీతో చర్చించి.. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు నిర్మాత నాగవంశీ. అలాగే మ్యాడ్ 2 థియేటర్లలో బాగా ఆడుతోందని.. ఈ విషయాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఫేక్ అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కలెక్షన్స్ విషయంలో ఎవరికి డౌట్ ఉన్నా చూపిస్తానని.. ఫేక్ కలెక్షన్స్ చెప్పానని ప్రూవ్ చేయాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అని అన్నారు. మ్యాడ్ 2సినిమా ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
“ఇప్పుడు ఒక సినిమా తీసి.. ప్రమోట్ చేసి ఓటీటీలో అమ్మడం చాలా కష్టమవుతుంది.. కోర్టు సినిమా బాగుంది కాబట్టే చూశారు. పక్క సినిమా బాగా లేకపోతే చూడలేదు. మ్యాడ్ స్కైర్ బాగుంది కాబట్టే ప్రేక్షకులు చూస్తున్నారు. అంతేకానీ మరో సినిమా బాగలేకపోతే కాదు.. చాలామంది రివ్యూలలో సెకండాఫ్ బాగలేదని రాశారు. సెకండాఫ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం నేను చూశాను.. రివ్యూలు రాసేవారికి జనాల కంటే ఎక్కువ తెలుసా.. కంటెంట్ లేని సినిమాలు ఆడుతున్నాయని రాయొద్దు” అని నాగవంశీ అన్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..