Most Recent

HIT 3 Movie Twitter Review : హిట్ 3 ట్విట్టర్ రివ్యూ.. నాని సినిమాకు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

HIT 3 Movie Twitter Review : హిట్ 3 ట్విట్టర్ రివ్యూ.. నాని సినిమాకు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. యూత్, ఫ్యామిలీ అడియన్స్ ప్రేక్షకులు నాని చిత్రాలను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కొన్నాళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. గతేడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు నాని. ఇక ఇప్పుడు హిట్ సిరీస్ సీక్వెల్ హిట్ 3లో నటిస్తున్నాడు. ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయిగా కనిపించిన నాని.. ఇప్పుడు హిట్ 3లో మాస్ యాక్షన్ హీరోగా వెండితెరపై సందడి చేయనున్నారు. అర్జున్ సర్కార్ పాత్రలో మాస్ హీరోగా మెప్పించేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచగా.. ఈసినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి మోస్ట్ అవైటెడ్ మూవీ హిట్ 3 సినిమా మేడే సందర్భంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. మరి నాని, శైలేష్ కొలను కాంబోలో వచ్చిన హిట్ 3 ఎలా ఉందో తెలుసుకుందామా.

హిట్ 3 ఫస్ట్ హాప్ బాగుందని.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మరింత హైలెట్ అయ్యాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అలాగే అర్జున్ సర్కార్ పాత్రలో నాని యాక్టింగ్ ఫైర్ అని.. ఈ సినిమా మొత్తానికి డైరెక్టర్ శైలేష్ కొలను మెయిన్ హైలెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నాని పాత్రకు రిఫ్రెష్ టేక్ అందించారని.. ఈసారి పూర్తిగా భిన్నమైన కోణాన్ని చూపించారని అంటున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను ప్రతి ఫేమ్ లో వివరంగా చూపిన శ్రద్ధ అద్భుతంగా ఉందని.. కథ ఒకే లైన్ చుట్టూ తిరుగుతుందని ట్వీట్ చేశారు. నాని నటించిన హిట్ 3 సినిమాకు తెల్లవారుజామున నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.