Most Recent

Retro Movie Twitter Review: రెట్రో మూవీ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

Retro Movie Twitter Review: రెట్రో మూవీ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

కోలీవుడ్ స్టార్ సూర్య సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చివరిసారిగా కంగువా చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు సూర్య. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ పీరియాడికల్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక కంగువా తర్వాత సూర్య నటించిన లేటేస్ట్ మూవీ రెట్రో. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. చాలా కాలం ఇండస్ట్రీలో సైలెంట్ అయిన పూజా .. ఇప్పుడు రెట్రో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. కొన్ని రోజులుగా రెట్రో సినిమా ప్రమోషన్లతో తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేశాడు సూర్య. ఈ చిత్రంలో జయరాం, బోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ రిలీజ్ చేశారు. మేడే సందర్భంగా గురువారం ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తెల్లవారుజామున నుంచే ఈ సినిమాకు రివ్యూస్ ఇస్తున్నారు అడియన్స్. ఇంతకీ సూర్య నటించిన ఈ రెట్రో మూవీ ఎలా ఉందో చుద్ధామా..

అయితే రెట్రో సినిమాకు ఎక్కడా ప్రీమియర్ షోస్ వేయట్లేదని తెలుస్తోంది. దీంతో ఇటు ట్విట్టర్ లోనూ రెట్రో సినిమాకు సంబంధించిన రివ్యూస్ అంతగా కనిపించడం లేదంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ఎర్లీ మార్నింగ్ షోస్ వేయడానికి రీజన్ సైతం ఉంది. ఇప్పటికే విదేశాల్లో సినిమా చూసిన కొందరు సినిమా పై నెగిటివిటీ రివ్యూస్ ఇస్తున్నారని.. అందుకే రెట్రో విషయంలో మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ చిత్రపరిశ్రమలో పలువురు స్టార్స్, దర్శకనిర్మాతలు ప్రీమియర్ షోలు వేయడం మానేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు ఇదే ఫాలో అవుతున్నట్లు సమాచారం.

మరోవైపు కోలీవుడ్ సూర్యకు.. రెట్రో మూవీటీంకు టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత కార్తీక్ సుబ్బరాజు, సూర్య కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాలో మరోసారి ఊరమాస్ యాక్షన్ హీరోగా సూర్య కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.