
సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ గుర్తింపు కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే చాలా మంది హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా గుర్తింపు అందుకొని హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. అందం అభినయంలో ఈ ముద్దుగుమ్మ ముందు లిస్ట్ లో ఉంటుంది. కానీ అనుకున్నంత గుర్తింపు మాత్రం అందుకోలేకపోయింది ఈ చిన్నది. తెలుగులో ఈ అమ్మడు దాదాపు 17 సినిమాలకు పైగా చేసింది. కొన్ని హిట్స్ కూడా అందుకుంది. కానీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో కేథరిన్ థ్రెసా ఒకరు. కేథరిన్ అసలు పేరు కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్. ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిన్నది దుబాయ్‌లో మలయాళీ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. చదువుతో పాటు కేథరిన్ పియానో, నృత్యం, గానం, ఐస్ స్కేటింగ్, డిబేటింగ్‌లో శిక్షణ పొందింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు ఈ బ్యూటీ ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంట్ వాలంటీర్‌గా కూడా పనిచేసింది.
తెలుగులో ఈ అమ్మడు 17 సినిమాల్లో నటించింది. కానీ ఈ చిన్నదానికి అనుకున్నంత గుర్తింపు మాత్రం దక్కలేదు. 2013లో వరుణ్ సందేశ్ సరసన “చమ్మక్ చల్లో” చిత్రంతో తెలుగు తెరంగేట్రం చేసింది. ఈ సినిమా విజయవంతం కానప్పటికీ, ఆమె నటన, అందం విమర్శకుల ప్రశంసలు పొందాయి. నానీ సరసన”పైసా” ), అల్లు అర్జున్ సరసన “ఇద్దరమ్మాయిలతో”, “సరైనోడు”, రానాతో “నేనే రాజు నేనే మంత్రి”, గోపీచంద్ తో”గౌతమ్ నంద వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ ఈ అమ్మడు మెప్పించింది. జయజనకీ నాయక సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. కేథరిన్ థ్రెసా ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో కొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.